Lord Ram Name Tattoo In Chhattisgarh Ramnami Samaj :ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాన గిరిజన తెగ రామనామీలు. వీరు మహానది ఒడ్డున ఉన్న గ్రామాల్లో నివసిస్తున్నారు. అయితే ఈ రామనామి తెగ ప్రత్యేకత ఏంటంటే ఈ తెగలోని ప్రతి ఒక్కరు తమ శరీరంలోని ప్రతి భాగంలోనూ శ్రీరాముడి పేరును పచ్చబొట్టుగా వేయించుకుంటారు. అయితే ఇలా రాముడి పేరును పచ్చబొట్టుగా వేయించుకోవానికి చరిత్రకారులు ఒక కథను చెబుతుంటే, పురాణాల్లో మరొక కథనం ఉందట.
ChhattisgarhRamnami Samaj Tattoos : పూర్వకాలంలో రామ-నామి సమాజం అంటరాని తనం ఉద్యమంలోని ఉపశాఖగా భావించే వారట. ఈ తెగవారిని అప్పట్లో శ్రీరాముని ఆలయంలోకి అనుమతించకపోవడంతో ఒక గిరిజన పెద్ద తన వంటిపై శ్రీరాముడి పేరును నుదిటిపై పచ్చబొట్టు వేసుకున్నారు. తమ నుంచి రాముడిని వేరు చేయలేరని చెప్పారట. అప్పటి నుంచి ఈ సంప్రదాయం నేటికీ పాటిస్తున్నారని ఒక కథనం వెలుగులో ఉంది.
అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ- రామాలయానికి చేరుకున్న అమితాబ్, రజినీకాంత్ సహా ప్రముఖులు
Ramnami Tribe Ram Tattoos :పురాణాల్లో మాత్రం గిరిజన తెగకు చెందిన పరశురామ్ భరద్వాజ్ ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఆయన 19 శతాబ్దం మధ్యకాలంలో ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాలోని చర్పారా గ్రామంలో జన్మించారు. చిన్నతనంలో రామాయణ కథల నుంచి ఎంతో స్ఫూర్తి పొందారు. చిన్నతనంలోనే తండ్రి దగ్గర వ్యవసాయ కూలీగా పనిచేయడం ప్రారంభించి 12 ఏళ్లకే పెళ్లి చేసుకున్నారు.
పరశురాం రామాయణంలోని కథలను అర్థం చేసుకోవడానికి, వాటి అర్థాలను అర్థం చేసుకోవడానికి చదవడం, రాయడం నేర్చుకున్నారు. పరశురాముడు కుష్టు వ్యాధి బారిన పడ్డారనీ. ఆ సమయంలో, అతను ఒక సాధువును కలుసుకోగా ఆయన పరశురాముణ్ని రామాయణం పఠించమని సూచించినట్లు పురాణాలు చెబుతున్నాయి. సాధువు చెప్పినట్లు చేయగానే మరుసటి రోజు నుంచి అతని ఆరోగ్యంలో మార్పులు వచ్చాయని పరశురాముడి శరీరంపై ‘రామ్-రామ్’ అనే పదం పచ్చబొట్టు రూపంలో కనిపించిందని కథనం ఉంది.