తెలంగాణ

telangana

ETV Bharat / state

అలర్ట్ : మూడు రోజులు మద్యం దుకాణాలు బంద్​ - మందుబాబులకు తిప్పలే! - LIQUOR SHOPS WILL CLOSE 3 DAYS

- రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అమలు

Liquor Shops Will Close 3 Days in TG
Liquor Shops Will Close 3 Days in TG (Getty Images)

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2025, 3:06 PM IST

Liquor Shops Will Close 3 Days in TG:మందుబాబులకు బ్యాడ్ న్యూస్​. మూడు రోజుల పాటు లిక్కర్ దుకాణాలు బంద్ కానున్నాయి. రాష్ట్రంలోని సగానికిపైగా జిల్లాల్లో ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కూడా లిక్కర్ షాపులు క్లోజ్ కానున్నాయి. లిక్కర్​ షాపులు బంద్​ కావడానికి కారణం ఏంటి? మళ్లీ వైన్స్​ ఎప్పుడు ఓపెన్​ అవుతాయి తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మూడు రోజుల పాటు లిక్కర్​ దుకాణాలు బంద్​ కావడానికి కారణం ఎమ్మెల్సీ ఎన్నికలు. రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం-వరంగల్- నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎలక్షన్ జరగనుంది. ఇక ఫిబ్రవరి 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉమ్మడి ఏడు జిల్లాల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.

హైదరాబాద్​లోనూ బంద్​: కేవలం ఎన్నికలు జరగనున్న ఉమ్మడి జిల్లాల్లో మాత్రమే కాకుండా, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న కొన్ని ప్రాంతాల్లోనూ ఈ బంద్ వర్తించనుంది. కొల్లూరు, ఆర్సీపురం పోలీస్​ స్టేషన్ల పరిధిలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఓటర్లను మభ్యపెట్టకుండా మద్యం దుకాణాలు బంద్​ చేస్తున్నట్లు తెలిపారు.

ఎప్పటి వరకు బంద్​: ఫిబ్రవరి 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ ప్రకటించారు. కల్లు కంపౌండ్‌లు, మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలోని క్లబ్బులు, పబ్బులు, స్టార్‌ హోటల్స్‌ల్లో సైతం మద్యం అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. నాన్-ప్రిప్రైటరీ క్లబ్‌లు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లలో మద్యం నిల్వ, సరఫరా కోసం లైసెన్సులు జారీ చేసినప్పటికీ ఈ మూడు రోజుల పాటు మద్యం అందించడానికి అనుమతి లేదని చెప్పారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు, మద్యం సరఫరాకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని కొన్ని పోలీస్​స్టేషన్లు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఇందులో యాదాద్రి జిల్లా కూడా ఉంది. ఇక్కడ కూడా మద్యం షాపులు క్లోజ్ అవుతాయి.

మందుబాటిళ్లు చూసి వచ్చిన పని మర్చిపోయాడు - కట్ చేస్తే!

ఆ ఊరివాసులు 12 ఏళ్లుగా తాగడం లేదు - ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం

ABOUT THE AUTHOR

...view details