తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్నం నరేందర్ రెడ్డికి చుక్కెదురు - ఆ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు - PATNAM HOUSE MOTION PETITION REJECT

పట్నం నరేందర్‌రెడ్డిని ప్రత్యేక బ్యారక్‌లో ఉంచాలని కోరుతూ పిటిషన్‌ - తిరస్కరించిన హైకోర్టు రిజిస్ట్రీ

Kodangal Ex MLA Patnam Narender Reddy
Patnam Narender Reddy Bail Petition (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2024, 5:15 PM IST

Patnam Narender Reddy House Motion Petition Rejected :కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన హౌజ్ మోషన్ పిటిషన్‌ తిరస్కరణకు గురైంది. చర్లపల్లి జైలులో తనను ప్రత్యేక బ్యారక్‌లో ఉంచాలంటూ హౌజ్‌ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫు న్యాయవాది ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రీకి పిటిషన్‌ను సమర్పించారు. నేరస్థులు ఉండే బ్యారక్‌లో పట్నం నరేందర్‌ రెడ్డిని ఉంచారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన పట్నం నరేందర్ రెడ్డిని ప్రత్యేక బ్యారక్‌లో ఉంచాలని ఆయన తరఫు న్యాయవాది హౌజ్‌ మోషన్ పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించారు. ప్రస్తుతం నరేందర్​ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

హైకోర్టులో నరేందర్‌రెడ్డి క్వాష్ పిటిషన్ : మరోవైపు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ లగచర్ల ఘటనలో ఏ1 నిందితుడిగా ఉన్న కొడంగల్‌ మాజీ శాసనసభ్యుడు పట్నం నరేందర్‌రెడ్డి గురువారం హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ప్రభుత్వాధికారులపై రాళ్ల దాడి కేసులో చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నరేందర్ రెడ్డి, తన న్యాయవాదులు ద్వారా కోర్టుకు అఫిడవిట్​ పంపించారు.

‘‘బుధవారం ఉదయం కేబీఆర్‌ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్న టైమ్​లో నన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా కారులో ఎక్కించి వికారాబాద్ జిల్లా డీటీసీకి తీసుకెళ్లారు. ఆ సమయంలో పోలీసులు నా స్టేట్‌మెంట్‌ అసలు తీసుకోలేదు. కేవలం కోర్టులో హాజరుపరిచే 10 నిమిషాల ముందు కొన్ని పేపర్లపై నా సంతకాలు తీసుకున్నారు. నన్ను అక్రమంగా ఈ దాడి కేసులో ఇరికించారు. అరెస్టుకు ముందు నాకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సహా ఇతర ముఖ్యనేతల అదేశాలతో దాడులు చేయించినట్లు పోలీసులు కట్టుకథ చెప్పారు.

నేను పోలీసులకు ఎలాంటి స్టేట్​మెంట్ ఇవ్వలేదు. రిమాండ్ నివేదికలో పోలీసులు చెప్పినవన్నీ నిజం కాదు. నా వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకొని విచారణ చేయాలి’’ అని కోర్టుకు పంపించిన అఫిడవిట్‌లో పట్నం పేర్కొన్నారు. మరో వైపు నరేందర్‌రెడ్డిని 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వికారాబాద్‌ జిల్లా కోర్టులో పిటిషన్‌ సైతం దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.

పట్నం నరేందర్ రెడ్డి బెయిల్‌ పిటిషన్, పోలీసుల కస్టడీ పిటిషన్ - రెండింటిపై సోమవారం విచారణ

ఎప్పుడు ఎవరిని తీసుకెళ్తారో అనే భయం - నిర్మానుష్యంగా మారిన ఆ 3 గ్రామాలు

ABOUT THE AUTHOR

...view details