Kishan Reddy Opened Central Tribal University at Mulugu :ములుగు జిల్లాలోసమ్మక్క సారలమ్మ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తాత్కాలిక భవనాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ సమ్మక్క సారక్క జాతీయ గిరిజన యూనివర్సిటీకి ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో భూమిని కేటాయిస్తే యూనివర్సిటీ శాశ్వత భవన నిర్మాణం చేపడతామని అన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.
యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో కేంద్రం అన్ని రకాల సహాయ, సహకారాలను సమ్మక్క-సారక్క యూనివర్సిటీకి అందిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ యూనివర్సిటీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నోడల్‌గా ఉంటుందని తెలిపారు. ఇక అడ్మిషన్లు ప్రారంభించి క్లాసులు నిర్వహించాలని సూచించారు.
Sammakka-Sarakka Central Tribal University : యూనివర్సిటీ భూమి విషయంలో అధికారులు వేగవంతంగా చర్యలు చేపట్టాలని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి మోదీ చేతుల మీదగా త్వరలోనే భూమి పూజ చేస్తారమని వెల్లడించారు. తెలంగాణలో కేవలం 9.8 శాతం గిరిజన జనాభా మాత్రమే ఉందని తెలిపారు. అందులో 50 శాతం మాత్రమే అక్షరాస్యులు ఉన్నారని, వీరిలో అక్షరాస్యతను పెంచాల్సిన అవసరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తోంది. గిరిజనుల పథకానికి రూ.24 వేల కోట్లు కేటాయించింది. ఈ గిరిజన యూనివర్సిటీకి రూ.900 కోట్లను బదలాయించింది. యూజీసీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ కొనసాగుతుంది. తెలంగాణలో జీవన విద్యా విధానం(Life Education System)లో రీసెర్చ్ ఉంటుంది. - కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి