తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Jun 10, 2024, 10:12 PM IST

ETV Bharat / state

ఇకనుంచి పాలిటిక్స్​కు దూరంగా ఉంటా'- రాజకీయ సన్యాసం తీసుకున్న కేశినేని నాని - kesineni nani quits politics

Kesineni Nani Sensational Decision on Politics: సార్వత్రిక ఎన్నికలో ఓటమిపాలైన కేశినేని నాని రాజకీయాలకు గుడ్​ బై చెప్పారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్​ వేదికగా ప్రకటించారు.

KESINENI NANI TWEET ABOUT POLITICS
Kesineni Nani Sensational Decision on Politics (ETV Bharat)

Kesineni Nani Sensational Decision on Politics : 2024 ఎన్నికల ముందు జగన్‌ పంచన చేరి ఓటమి పాలైన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయ సన్యాసం తీసుకున్నారు. తన రాజకీయ ప్రయాణం ముగిస్తున్నట్లు నాని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రకటించారు. జాగ్రత్తగా ఆలోచించాకే, రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపమైన గౌరవమని ఆయన తెలిపారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా, విజయవాడ అభివృద్ధికి మద్దతు ఇస్తూనే ఉంటానని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో తన సోదరుడి కేశినేని చిన్ని చేతుల్లో నాని ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

"ఇకనుంచి రాజకీయాలకు దూరంగా ఉంటా. నా రాజకీయ ప్రయాణాన్ని ముగించా. రెండుసార్లు ఎంపీగా విజయవాడ ప్రజలకు సేవ చేశా. విజయవాడ అభివృద్ధికి నా వంతు మద్దతిస్తూనే ఉంటా. విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు." - ఎక్స్‌లో కేశినేని నాని ట్వీట్

ABOUT THE AUTHOR

...view details