Kankanam Darshan History at Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రపంచం నలు మూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. అందుకే తిరుమల కొండ నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక పండగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో మరింతగా కిక్కిరిసిపోతుంది. భక్తులు ఎక్కువగా ఉన్న సమయాల్లో వైకుంఠం రెండో క్యూకాంప్లెక్స్‌లోనే, సుమారు 30 గంటలపాటు భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచిచూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే దర్శనం త్వరగా పూర్తి చేసేందుకు టీటీడీ గతంలో పలు నిర్ణయాలు తీసుకుంది. అందులో కొన్ని రద్దు కాగా, మరికొన్ని కొత్తవి అమల్లోకి వచ్చాయి.
దర్శనాలు పలు రకాలు :
- భక్తులకు పలు రకాల దర్శనాలు అందుబాటులో ఉన్నాయి. సర్వ దర్శనం మొదలు, వీఐపీ దర్శనం వరకు వివిధ రకాలుగా ఉన్నాయి.
- ప్రత్యేక ప్రవేశ దర్శనం ప్రస్తుతం అమల్లో ఉంది. ఇందు కోసం రూ.300 టికెట్ కొనుగోలు చేయాలి.
- ప్రత్యేక దర్శనం అని మరో దర్శనం ఉంది. ఈ టికెట్ ఖరీదు రూ.10,500
- ఇంకా ఆర్జిత సేవలు, సర్వదర్శనం, స్లాట్ దర్శనం, అంటూ పలు రకాలు ఉన్నాయి.
- స్లాట్ దర్శనం ద్వారా రెండు, మూడు గంటల్లోనే స్వామి దర్శనం కలుగుతుంది. విష్ణునివాసం, శ్రీనివాసంలో ఆధార్ ప్రకారం దర్శన సమయం కేటాయిస్తారు. కానీ ఈ టికెట్లు పరిమితంగానే ఉంటాయి.
- శ్రీవారి మెట్టు, అలిపిరి నుంచి కాలి నడకన వచ్చే వారికోసం గతంలో "దివ్యదర్శనం" పేరుతో కొన్ని టికెట్లు ఇచ్చేవారు. వీటితో 2 నుంచి 3 గంటల్లోనే స్వామి దర్శనం జరిగేది. కానీ, గత ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసింది.