Journalists Pays Grand Tribute to Ramoji Rao : ఈనాడు, ఈటీవీ సంస్థల అధినేత రామోజీరావు మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నేతలు, జర్నలిస్టులు ఆయనకు నివాళులర్పించారు. మీడియా రంగంలో ఆయనొక ధ్రువతారగా నిలిచిపోతారని కొనియాడారు.
మీడియా దిగ్గజం రామోజీరావుకి మైలవరం తెలుగుదేశం పార్టీ నాయకులు అశ్రునివాళులర్పించారు. రామోజీరావు మరణం పత్రికా రంగానికి తీరని లోటని అన్నారు. స్థానికి ఎన్టీఆర్ విగ్రహం వద్ద రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, విలువలు జోడించిన ఘనత రామోజీరావుకే దక్కుతుందని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పాత్రికేయులు ర్యాలీ చేశారు. రామోజీరావు మృతి పత్రికా రంగానికి తీరని లోటని కృష్ణా జిల్లా నాగాయలంక తెలుగుదేశం, జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రధాన కూడలిలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
ప్రజా గొంతుకై మోగిన నిలువెత్తు అక్షరసేనానికి అశ్రునివాలి - Politicians Tribute to Ramoji Rao Demise
విజయవాడలో పాత్రికేయులు ఘనంగా నివాళులు అర్పించారు. వేలాదిమంది పాత్రికేయుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా వృత్తి విలువలను నేర్పిన వ్యక్తి రామోజీరావని వారు అభివర్ణించారు. పాత్రికేయ వృత్తిని సామాజిక బాధ్యతగా గుర్తించి జర్నలిజానికి కొత్త వెలుగులు తెచ్చారని కొనియాడారు. పాత్రికేయరంగం ఉన్నంత వరకు రామోజీరావు పేరు చిరస్థాయిగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.