తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్‌తో రూ.18 లక్షల జీతం - ఆర్మీలో ఉద్యోగాలు - లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

విద్యార్థులకు సూపర్ న్యూస్‌ - ఇంటర్‌ అర్హతతో ఆర్మీలో ఉద్యోగం - ఇంజినీరింగ్‌ పట్టాతో పాటు జాబ్‌ - సంవత్సరానికి జీతం ఏకంగా రూ.18లక్షలు

Indian Army Technical Entry Scheme
Indian Army Technical Entry Scheme (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 21, 2024, 12:04 PM IST

Updated : Oct 21, 2024, 2:58 PM IST

Indian Army Jobs With Inter Qualification :ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌ విద్యార్థులు ఉచితంగా బీటెక్‌ చదువుకుని, లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగంలో చేరే సువర్ణవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అందిస్తోంది. జేఈఈ మెయిన్‌ స్కోరుతో దరఖాస్తులు షార్ట్‌లిస్ట్‌ చేసి, రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి ఈ కోర్సులోకి తీసుకుంటారు. వీరికి బీటెక్ కోర్సు, లెఫ్టినెంట్‌ కొలువులకు సంబంధించిన ఉచిత శిక్షణ నాలుగు సంవత్సరాలు అందిస్తారు. ఆ తర్వాత విధుల్లోకి తీసుకుంటారు. ఈ సమయంలో రూ.18లక్షల వరకు వార్షిక జీతం పొందవచ్చు. అత్యున్నత స్థాయికీ చేరుకోవచ్చు.

జేఈఈ మెయిన్‌ స్కోర్ తప్పనిసరి : ఏడాదికి రెండు సార్లు 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ నోటిఫికేషన్ విడుదలవుతుంది. ప్రతిసారీ ఈ స్కీమ్ కింద 90మందికి అవకాశం కల్పిస్తారు. జేఈఈ మెయిన్‌ -2024 స్కోరుతో ఈ కోర్సు, ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తు పరిశీలించి, ఎక్కువ స్కోరు ఉన్న వారికి కోర్సు, ట్రైనింగ్‌ అవకాశం కల్పిస్తారు.

Indian Army Technical Entry Scheme Jobs :ఇలా ఫిల్టరై నిలిచినవారికి సర్వీస్‌ సెలక్షన్ బోర్డు ఆధ్వర్యంలో జనవరి - మార్చిలోపు బెంగళూరులో ఐదు రోజులు రెండు ఫేజేలలో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. తొలిరోజు ఫేజ్‌-1 స్క్రీనింగ్‌ (ఇంటెలిజెన్స్) పరీక్షల్లో అర్హత సాధించినవారికి ఫేజ్‌-2కి ఎంపిక చేస్తారు. ఆ తర్వాత నాలుగు రోజులు నిర్వహించే వివిధ పరీక్షల్లో అన్ని విభాగాల్లోనూ రాణించినవారిని కోర్సు, ట్రైనింగ్‌లోకి తీసుకుంటారు.

ఐటీఐతో హైదరాబాద్​లో జాబ్స్ - నెలకు రూ.30 వేల శాలరీ - టైమ్ తక్కువుంది త్వరపడండి!

రెండు ఫేజుల్లో ట్రైనింగ్ : జులై 2025 నుంచి కోర్సు, ట్రైనింగ్ ప్రారంభమవుతుంది. నాలుగు సంవత్సరాలు టెక్నికల్ ట్రైనింగ్ పుణె, సికింద్రాబాద్, మావ్‌ల్లోని ఆర్మీ కేంద్రాల్లో ఎక్కడైనా శిక్షణ ఇస్తారు. ఇందులో రెండు దశలు ఉంటాయి. ఫేజ్‌-1లో మూడేళ్ల పాటు ప్రీ కమిషన్ ట్రైనింగ్ ఇస్తారు. ఫేజ్‌-2లో ఏడాది పాటు పోస్ట్‌ కమిషన్ శిక్షణ ఉంటుంది. మూడేళ్ల ఫేజ్‌-1 శిక్షణ పూర్తిచేసుకుని, ఫేజ్‌-2లో చేరినప్పుడు ప్రతి నెలా రూ.56,100 స్టైఫండ్ ఇస్తారు.

పోస్టులు: 90

కావాల్సిన అర్హతలు :

  • ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌/ప్లస్‌ 2 పూర్తి చేయాలి.
  • జేఈఈ మెయిన్స్‌ 2024 స్కోరు తప్పనిసరిగా ఉండాలి.
  • ఈ స్కీమ్‌కు పురుషులు మాత్రమే అర్హులు.

వయసు:16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 2006 - జనవరి 1, 2009 మధ్య జన్మించినవారే ఈ పథకానికి అర్హులు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: నవంబరు 6 వరకు తీసుకుంటారు.

విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా?, ఇదిగో సువర్ణవకాశం - రేపే లాస్ట్​డేట్

ఈ లైబ్రరీల్లో 'చదువు' ఒక్కటే కాదు - అంతకు మించి ఎన్నో సేవలు - Free Library in Hanamkonda

Last Updated : Oct 21, 2024, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details