50% Engineering Students Failed in 1st Semester :ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యమైన బోధన, సరైన సంఖ్యలో ఆచార్యులు, సహాయ ఆచార్యులు లేకపోవడంతో జేఎన్‌టీయూ హైదరాబాద్ క్యాంపస్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో చదువుకుంటున్న మొదటి సంవత్సరం విద్యార్థులు వేల సంఖ్యలో ఫెయిలవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జనవరిలో ఇంజినీరింగ్ ఫస్ట్ సెమిస్టర్ రాసిన 17,063 మంది విద్యార్థుల్లో 7,380 మంది విద్యార్థులు మాత్రమే అన్ని సబ్జెక్టులు పాసయ్యారు. 57శాతం మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు.
ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో మూడు, నాలుగేళ్ల నుంచి బోధనా సిబ్బంది తగ్గిపోవడం, ఇంజినీరింగ్ సీట్లను పెంచిన యాజమాన్యాలు వాటికి అనుగుణంగా ప్రొఫెసర్లను నియమించకపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతోపాటు ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు తనిఖీలు నిర్వహిస్తున్న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యుల్లో కొందరు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఈ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.
ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ : ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్? - CM Revanth SAID fee reimbursement
వేలిముద్రల ప్రొఫెసర్లు - అరకొర తరగతులు :ఇంజినీరింగ్ ఫస్ట్ సెమిస్టర్‌లో 9,677 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం ఇదే తొలిసారి. ఇందులో జేఎన్‌టీయూ పరిపాలనా విభాగం వైఫల్యమే హెచ్చుగా ఉంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ప్రమాణాలకు అనుగుణంగా ఆచార్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను బోధనా సిబ్బందిగా నియమించాల్సి ఉండగా, కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు పీహెచ్‌డీ లేకపోయినా ఎంటెక్ విద్యార్హతతో ప్రిన్సిపల్‌గా నియమిస్తున్నాయి.
మరికొన్ని ఇంజినీరింగ్ కాలేజీలు బీటెక్ పూర్తిచేసిన వారికి సహ ఆచార్యులుగా ఉద్యోగాలిచ్చాయి. మరికొన్ని యాజమాన్యాలైతే, కేవలం నిబంధనలు పాటించేందుకు ప్రొఫెసర్లను నియమించుకుని వారితో బయోమెట్రిక్ అటెండెన్స్ వేయించి మమ అనిపిస్తున్నాయి. జేఎన్‌టీయూ క్యాంపస్‌లోనూ మొదటి సెమిస్టర్ పరీక్షలు 1,125 మంది విద్యార్థులు రాస్తే, 678మంది మాత్రమే పాసయ్యారు.
JNTU, Osmania Reduce Credits : వేలమంది విద్యార్థులు ఫెయిలవుతుండడంతో జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు క్రెడిట్స్‌ను తగ్గించాయి. క్రెడిట్స్‌ను తగ్గించడం ద్వారా మిగిలిన సెమిస్టర్లలో స్టూడెంట్స్‌కు ఒత్తిడి పెరిగిపోతుందని నిపుణులంటున్నారు. విభిన్న నేపథ్యాల నుంచి వస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులు ముందుకు వెళ్లేందుకు ఈ అవకాశం కల్పిస్తున్నామని ఉస్మానియా, జేఎన్‌టీయూ అధికారులు వివరిస్తున్నారు.
YUVA : రైతు బిడ్డకు రూ.52 లక్షల ప్యాకేజీ కొలువు - ఔరా అనిపిస్తున్న ఆశ్రిత - WOMAN BAGS 52 LAKH PACKAGE