ISRO successfully launches NVS Zero Two satellite :భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రాత్మక 100వ ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో షార్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్ ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని(శాటిలైట్)ను తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది. అనంతరం ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది.
ఎన్వీఎస్-02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినటువంటి స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. ఈ శాటిలైట్ బరువు 2,250కిలోలు. ఈ ఎన్వీఎస్-02 కొత్తతరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వి.నారాయణన్‌కు ఇది మొదటి ప్రయోగం కావడంతో ఈ ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించి ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలనూ పర్యవేక్షించారు. ముఖ్యంగా భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్ సేవల కోసం ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, స్మార్ట్ ఫోన్లలో లోకేషన్ ఆధారిత సేవలందించనుంది.
ఈ 100వ ప్రయోగం మైలురాయిగా నిలుస్తుంది:ఇస్రో శాస్త్రవేత్తలకు ఛైర్మన్ నారాయణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని ఆయన తెలిపారు. నావిగేషన్ శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లుగా వివరించారు. ఈ 100వ ప్రయోగం మైలురాయిగా నిలుస్తుందని నారాయణన్ పేర్కొన్నారు.