Telangana In Irrigation Projects: గత వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులకు భారీగా నీరు వచ్చి చేరుతుంది. నీటి నిలువలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో అధికారులు ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వర్షపు నీరుతో పాటుగా పై నుంచి వచ్చే వరద నీరుతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. కడెం, జూరాల, ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జలశయాలకు భారీగా నీరుచేరుతుంది.
నిర్మల్ జిల్లా కడెం జలాశయం నీటి మట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలో ఎడతెరపి లేని వర్షాలకు జలాశయంలో వరద నీరు చేరుతోంది. కడెం ప్రాజెక్టులోకి 10వేల488 క్యూసెక్కుల నీరు చేరుతుందిం. దీంతో అధికారులు రెండు వరద గేట్ల ద్వారా 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 692 అడుగులకు చేరుకుంది.
జూరాల జలాశయానికి భారీగా వరద ప్రవాహం ప్రవాహం వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1.96 లక్షల క్యూసెక్కులు ఉండగా, జలశయా 42గేట్ల ద్వారా 1.92 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. జారాల పూర్తి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా, ప్రస్తుతం 316.66 మీటర్లుకు చేరుకుంది. జూరాల నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు ఉండగా, ప్రస్తుత నీటి నిల్వ 6.18 టీఎంసీలకు చేరినట్లు నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు.
బొగత జలపాతంలో ఈతకు వెళ్లి యువకుడు మృతి - Man Died at Bogatha Waterfalls