తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫిబ్రవరి 15 తర్వాత ఎండలు మండిపోతాయి : వాతావరణ శాఖ - TELANGANA WEATHER REPORT

రాగల మూడు, నాలుగు రోజుల పాటు పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని ప్రకటించిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం - వాతావరణ మార్పులపై వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్నతో ఇంటర్వ్యూ

TELANGANA WEATHER REPORT
TELANGANA WEATHER REPORT (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 23, 2025, 3:34 PM IST

IMD Director Dr Nagaratna on Weather Report :రాష్ట్రంలో రాగల మూడు, నాలుగు రోజుల పాటు పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తూర్పు, ఈశాన్య జిల్లాలతో పాటు హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. తూర్పు, ఆగ్నేయ గాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని అన్నారు. ఫిబ్రవరి 15 వరకు వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. ఒక్కొక్కప్పుడు చల్లగాలులు, మరొక్కప్పుడు వేడిగాలులు వీస్తాయని, ఫిబ్రవరి 15 తర్వాత వేడి తీవ్రత పెరుగుతుందంటున్న వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్నతో ఈటీవీ ప్రతినిధి జ్యోతికిరణ్‌ ముఖాముఖి.

"తెలంగాణలో వచ్చే మూడు, నాలుగు రోజులు పొగమంచు ఎక్కువగా ఉంటుంది. తెల్లవారుజామున చలిగా ఉంటుంది. తూర్పు, ఆగ్నేయ గాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 15 వరకు వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొంటాయి."-డాక్టర్ నాగరత్న, వాతావరణ శాఖ సంచాలకులు

ABOUT THE AUTHOR

...view details