UPSC Third Ranker Ananya Interview :అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ(UPSC) నిర్వహించిన సివిల్స్ తుది ఫలితాలు తాజాగా విడుదల కాగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అనన్యరెడ్డి(DONURU ANANYA REDDY) మూడో ర్యాంకు సాధించారు. ఎటువంటి కోచింగ్ తీసుకోకుండానే, మొదటి ప్రయత్నంలోనే ఆలిండియా మూడో ర్యాంక్ సాధించారు. రోజుకు 12-14 గంటలు చదివానని ఆమె చెబుతున్నారు.
సివిల్స్‌లో సత్తా చాటిన పాలమూరు బిడ్డ - మొదటి ప్రయత్నంలోనే ఆలిండియా మూడో ర్యాంక్ - upsc topper Ananya Reddy Interview - UPSC TOPPER ANANYA REDDY INTERVIEW
UPSC Topper Ananya Reddy Interview : యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ తుది ఫలితాల్లో మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్యరెడ్డి సత్తా చాటారు. తొలి ప్రయత్నంలోనే తన అసాధారణ ప్రతిభతో మూడో ర్యాంకు సాధించారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో, చిన్ననాటి నుంచే సివిల్స్ చదవాలని నిర్ణయించుకున్నట్లు అనన్య తెలిపారు. తమ కుమార్తె మూడో ర్యాంకు సాధించటం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
Published : Apr 16, 2024, 6:50 PM IST
|Updated : Apr 16, 2024, 7:01 PM IST
UPSC Civils 2024 Results : పదో తరగతి వరకు మహబూబ్‌నగర్ లో చదివిన అనన్య, ఇంటర్ విద్యను హైదరాబాద్‌లో అభ్యసించారు. దిల్లీలోని మెరిండా హౌస్ కాలేజీలో డిగ్రీ చదివిన ఆమె ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే ఈ ఘనతను సాధించారు. ఎంతో కఠినమైన సివిల్స్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలలో ఎదురయ్యే కఠిన సవాళ్లను ఎదుర్కొని నిలవడం ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటిది తొలి ప్రయత్నంలోనే కోచింగ్ కూడా తీసుకోకుండా దాదాపు సొంత ప్రిపరేషన్‌తోనే సివిల్స్‌లో జాతీయస్థాయిలో మూడో ర్యాంకుతో భళా అనిపించారు అనన్య రెడ్డి. ఇంటర్వ్యూ తర్వాత సివిల్స్‌కు ఎంపిక అవుతానని భావించినప్పటికీ, మూడో ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదని ఆమె చెప్పారు.
చదివే సమయంలో ఒత్తిడికి గురికాకుండా క్రికెట్ చూడటం, నవలు చదవడం చేస్తున్నట్లు తెలిపారు. నిజం చెప్పాలంటే ప్రతికూల సమయాల్లో సైతం రాణించాలంటే ఎలా మెలగాలో విరాట్ కోహ్లీనే తనకు ప్రేరణ అని చెబుతున్నారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చిన్ననాటి నుంచే సివిల్స్ చదవాలని నిర్ణయించుకున్నట్లు అనన్య చెప్పారు. తమ కుమార్తె మూడో ర్యాంకు సాధించటం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.