IMD Predicts That This Year Will Be The Coldest :ఈ ఏడాది చలి పులి పంజా విసిరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సెప్టెంబరు నెలతో వానాకాలం ముగిసింది. ఉత్తర భారత దేశానికి విస్తరించిన నైరుతి రుతుపవనాలు తిరోగమనం కూడా మొదలైంది. అయితే ఈ పననాల కదలికలు కాస్త నెమ్మదిగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నెలలో లా నినా ఏర్పడే పరిస్థితులు ఉండడంతో దేశవ్యాప్తంగా చలి తీవ్రత ఉండొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ పరిస్థితులు వాయవ్య, మధ్య భారత దేశాల్లో విపరీతమైన చలిగాలులు వీచేందుకు దారి తీస్తాయని భావిస్తున్నారు.
అప్పటి వరకు మోస్తరు వర్షాలు :మరోవైపు దేశ వాయవ్య భాగమైన పంజాబ్, దిల్లీ ప్రాంతాల నుంచి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతోంది. ఈ నెల మొదటి వారానికి మధ్య, ఈశాన్య భారత దేశాన్ని రుతు పవనాలు వీడినట్లయితే నిర్దిష్ట అంచనాల మేరకే కదలికలు ఉన్నట్లు భావిస్తారు. ఆలస్యమైతే మాత్రం ఈ నెల, వచ్చే నెల చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 17 నాటికి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను దాటి పవనాలు వెనక్కి వెళ్లిపోతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో రెండేళ్ల నుంచి చలి తీవ్రత అధికంగానే ఉంటోంది.
తెలంగాణపై చలి పంజా - వాళ్లు జాగ్రత్తగా ఉండాల్సిందేనంటున్న వైద్యులు