ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో భారీగా గోవా లిక్కర్​ - 30 వేల బాటిళ్లు స్వాధీనం - Illegal Liquor Bottles Seized

Illegal Liquor Bottles Seized in Nandyal : ఎన్నికల వేళ రాష్ట్రంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. నంద్యాల జిల్లాలో భారీగా గోవా మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. 800 మద్యం బాక్సులను స్వాధీనం చేసుకోగా అందులో 30 వేల బాటిళ్లు ఉన్నట్లు తెలిపారు.

Illegal Liquor Bottles Police Seized
Illegal Liquor Bottles Police Seized (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 9:16 PM IST

Updated : May 3, 2024, 10:30 PM IST

నంద్యాలలో భారీగా గోవా లిక్కర్​ - 30 వేల బాటిళ్లు స్వాధీనం (ETV Bharat)

Illegal Liquor Bottles Police Seized : ఎన్నికల వేళ రాష్ట్రంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లాలో భారీగా గోవా మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని మహానంది మండలం గాజులపల్లి చెక్ పోస్టు వద్ద భారీగా మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గోవా నుంచి విజయవాడకు అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. లారీని పోలీసులు తనిఖీలు చేయగా మద్యం ఉండటంతో వెంటనే లారీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. లారీలో తరలిస్తున్న సుమారు 800 మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నామని అందులో 30 వేల మద్యం బాటిళ్లు ఉన్నాయన్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

జోజినగర్​ గోదాములో అనుమానాస్పద నిల్వలు- పోలీసుల దాడుల్లో భారీగా నకిలీ సిగరెట్ల పట్టివేత - Police Seized Fake Cigarettes

Telangana Liquor Siezed: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మాగల్లు వద్ద బైక్​పై అక్రమంగా తరలిస్తున్న160 తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు అందిన సమాచారం మేరకు మధిర వైపు నుంచి నందిగామ వస్తున్న ఒక ద్విచక్ర వాహనదారుడు తెలంగాణ మద్యం బాటిళ్లను తీసుకుని వస్తుండగా అతడిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్​కు తరలించి అతని వద్ద ఉన్న 160 మద్యం బాటిళ్లు, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నందిగామ ఏసీబీ రవి కిరణ్ మద్యం సీసాలను పరిశీలించారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

పంచాయతీ భవనంలో మద్యం - వైఎస్సార్​సీపీ సర్పంచ్​ భర్తపై టీడీపీ నేతల ఫిర్యాదు - YCP Leader Liquor Bottles Stored

ఎన్నికల వేళ మద్యం, గంజాయి అధిక మొత్తంలో పట్టుబడుతున్నాయి. కేవలం ఇవి మాత్రమే కాకుండా భారీ ఎత్తులో నగదు సైతం పట్టుబడుతుండటంతో రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. పోలీసుల తనిఖీల్లో పలువురు నాయకులు ప్రజలకు తాయిలాలు అందించడానికి తీసుకొచ్చిన సామగ్రి సైతం దొరకడం గమనార్హం. ఎన్నికల వేళ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకూడదని అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు చెక్​పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రూ.4 లక్షల పైగా విలువైన మద్యం బాటిళ్లు స్వాధీనం - Illegal Liquor Bottles

ఎమ్మెల్యే అనుచరుడి ఇంట్లో మద్యం: వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి అనుచరుడి ఇటుక బట్టీల్లో మద్యం పట్టబడింది. పాకాల మండలం ఎల్లంపల్లి వద్ద కపిల్‌ రెడ్డి ఇటుక బట్టీల్లో పోలీసులు మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇటుక బట్టీల్లో వ్యాను, కారు, 500 కేసుల మద్యం పట్టుకున్నారు. కపిల్​ రెడ్డి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు.

Last Updated : May 3, 2024, 10:30 PM IST

ABOUT THE AUTHOR

...view details