ETV Bharat / state

'జగన్‌ బ్యాచ్‌ తిరుమలను నాశనం చేశారు - ప్రజల మనోభావాలతో ఆడుకున్నారు' - Political Leaders on Laddu Issue - POLITICAL LEADERS ON LADDU ISSUE

Political Leaders Comments on Tirumala Laddu Issue: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం రాజకీయంగా ప్రకంపంనలు సృష్టిస్తోంది. నెయ్యి కల్తీపై తాను ఎంతో కలత చెందానన్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ బాధ్యులపై కఠిన చర్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అప్పటి టీటీడీ ఈవో, ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ బ్యాచ్‌ తిరుమలను కూడా నాశనం చేశారన్న మంత్రి లోకేశ్​ తమ ప్రభుత్వం తిరుమల పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్‌ చేశారు.

political_leaders_on_laddu_issue
political_leaders_on_laddu_issue (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2024, 7:46 PM IST

Updated : Sep 20, 2024, 10:02 PM IST

Political Leaders Comments on Tirumala Laddu Issue: తిరుమల వెంకటేశ్వరస్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న వార్తలతో కలత చెందానని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఈ వ్యవహారానికి కారకులైన వారిపై వీలైనంత త్వరగా కఠిన చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలకు వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ఉండగా పనిచేసిన అధికారులు, జగన్ ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలన్నారు.

హిందూ దేవాలయాలను అపవిత్రం చేయటం, ధార్మిక వ్యవహారాలను పట్టించుకోకపోవటం వల్లే ఇలాంటి పరిణామాలకు ఆస్కారం ఏర్పడిందన్నారు. దేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో 'సనాతన ధర్మ రక్షణ బోర్డు'ను ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు, మత పెద్దలు, న్యాయవ్యవస్థ, పౌరులు, మీడియాలో ఈ అంశాలపై విస్తృత చర్చ జరగాలన్నారు. సనాతన ధర్మానికి ఏ రూపంలోనూ అపవిత్రత జరగకుండా కట్టడి చేయడానికి అందరూ కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు.

'జగన్‌ బ్యాచ్‌ తిరుమలను నాశనం చేశారు - ప్రజల మనోభావాలతో ఆడుకున్నారు' (ETV Bharat)

తిరుమల లడ్డూ ఎలా తయారు చేస్తారు? - ఏయే వస్తువులు వినియోగిస్తారో తెలుసా! - How to make Tirumala Laddu

స్వచ్ఛమైన నెయ్యి ధర ఎక్కువ ఉంటుంది. తక్కువ ధరకు నెయ్యి వస్తుందని ఎలా కొంటారు. లడ్డూ ప్రసాదంపై ప్రజల నుంచి ఫిర్యాదులు చాలా వచ్చాయి. ల్యాబ్‌ పరీక్షలు నిర్వహించాలని ప్రజలు ఫిర్యాదులు చేశారు. ప్రజల మనోభావాలతో ఎవరూ చెలగాటం ఆడవద్దు. కూటమి ప్రభుత్వం వచ్చాక టీటీడీలో ప్రక్షాళన చేపట్టాం. ఫిర్యాదులు వస్తున్నా టీటీడీ గత ఛైర్మన్‌, ఈవో పట్టించుకోలేదు. లడ్డూ కల్తీ గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్రజల మనోభావాలు గౌరవించకుండా ఆలయ పవిత్రత దెబ్బతీశారు.- పవన్‌ కల్యాణ్, డిప్యూటీ సీఎం

Minister Nara Lokesh: వైఎస్సార్​సీపీ నేతలు టీటీడీలో కూడా అవినీతికి పాల్పడ్డారన్న మంత్రి నారా లోకేశ్​ ఆ దేవదేవుడి లడ్డూ తయారీలో కూడా నాణ్యతకు తిలోదకాలిచ్చారన్నారు. ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటించిన మంత్రి లోకేశ్​ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కిడ్నీ డయాలసిస్ యూనిట్‌ని ప్రారంభించారు.

PCC President YS Sharmila: లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలన్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాస్తామని చెప్పారు. గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

320కే కిలో వస్తుందంటే ఆలోచించొద్దా - కల్తీ నెయ్యితో దేవుడికి నైవేద్యం పెడతారా?: సీఎం చంద్రబాబు - CM Chandrababu on TTD Laddu Issue

నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది - నాణ్యమైన నెయ్యి అంత తక్కువ ధరకు ఎలా ఇస్తారు? : టీటీడీ ఈవో - TTD EO on Laddu Controversy

Last Updated : Sep 20, 2024, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.