ETV Bharat / entertainment

'NTR 31' షూటింగ్ అప్​డేట్​ - ఆ షెడ్యూల్​లో తారక్ ఉండరట! - Jr Ntr 31 Shooting Update - JR NTR 31 SHOOTING UPDATE

Jr NTR 31 Shooting Update : జూనియర్ ఎన్​టీఆర్, కొరటాల శివ కాంబినేషన్​లో తెరకెక్కనున్న ఎన్​టీఆర్ 31 గురించి ఆ మూవీ హీరో తారక్ తాజాగా ఓ స్పెషల్ అప్​డేట్ రివీల్ చేశారు. ఆ విశేషాలు మీ కోసం.

Jr NTR 31
Jr NTR (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2024, 12:05 PM IST

Jr NTR 31 Shooting Update : జూనియర్ ఎన్​టీఆర్, డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో రానున్న 'NTR 31' సినిమా గురించి మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్న తరుణంలో తాజాగా తారక్​ ఓ స్పెషల్ అప్​డేట్ ఇచ్చారు. 'దేవర' ప్రమోషన్స్​లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దీని షూటింగ్‌ అప్‌డేట్‌ను ఆయన రివీల్ చేశారు.

"ప్రశాంత్‌ నీల్‌ సినిమా షూటింగ్​ అక్టోబర్‌ 21 నుంచి స్టార్ట్​ అవ్వనుంది. ఫస్ట్ షెడ్యూల్‌ సుమారు 40 రోజుల పాటు జరుగుతుంది. అయితే అందులో నేను ఉండను. ఇతర నటీనటులకు సంబంధించిన సీన్స్​ను షూట్​ చేసేందుకే ఆ షెడ్యూల్. అయితే నేను ఈ సెట్స్​లోకి 2025 జనవరి కల్లా జాయిన్ అవుతాను." అంటూ తారక్ తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి 'డ్రాగన్‌' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాతనే జూనియర్ ఎన్​టీఆర్​ 'దేవర 2'లో నటించనున్నట్లు మరో రూమర్ కూడా నెట్టింట ట్రెండ్ అవుతోంది.

హీరోయిన్ ఆమెనే!
మాస్ డైరెక్టర్- స్టార్ హీరోతో భారీ అంచనాల మధ్య తెరకెక్కనున్న సినిమాలో కచ్చితంగా అంతే క్రేజ్ ఉన్న హీరోయిన్ ఎంచుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ నేషనల్ క్రష్ రష్మక మందన్నాతో సంప్రదింపులు జరిపినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ కథకు రష్మిక సరిగ్గా సరిపోతుందని సినిమా యూనిట్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీకి కథ వినిపించినట్లు సమాచారం . ఒకవేళ ఇది నిజమైతే రష్మిక- ఎన్​టీఆర్ కాంబోలో రానున్న తొలి సినిమా ఇదే అవుతుంది.

ఆ సినిమాలే కారణమా? అయితే గత రెండేళ్లలో రష్మిక నటించిన పుష్ప పార్ట్-1, 'యానిమల్' సినిమాలు భారీ విజయాలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. దీంతో ఇండియావైడ్​గా మూవీ లవర్స్​కు రష్మిక పరిచయమైంది. మరోవైపు ఈమె నటనకు బ్యూటీ తోడవడం వల్ల ఈ సినిమాలో ఆఫర్ కొట్టేసినందని అంటున్నారు. కానీ, దీనిపై మేకర్స్​ నుంచి అప్​డేట్ రావాల్సి ఉంది.

NTR 31 అప్డేట్​- స్టోరీ చాలా కొత్త ఉంటుందట! నీల్​ మామ ఏం చేస్తాడో?

టాలీవుడ్ బడా హీరోల సినిమాలు - షూటింగ్ ఎక్కడి దాకా వచ్చిందంటే? - Tollywood Upcoming Movies

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.