ETV Bharat / sports

సినిమాల్లోకి వార్నర్ ఎంట్రీ - 'పుష్ప 2'లో కీ రోల్- లుక్​ వైరల్! - David Warner Pushpa 2 - DAVID WARNER PUSHPA 2

David Warner Pushpa 2 : ఆసీస్‌ మాజీ ఆటగాడు వార్నర్‌ క్రికెట్​తోపాటు సోషల్ మీడియా రీల్స్​తోనూ బాగా ఫేమస్​ అయ్యాడు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోల డైలాగ్స్, పాటలకు డ్యాన్స్ స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే ఇటీవల క్రికెట్​కు గుడ్​బై చెప్పిన వార్నర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో ఓ లుక్​ వైరల్‌గా మారింది.

David Warner Pushpa
David Warner Pushpa (Source : Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 20, 2024, 8:48 PM IST

Updated : Sep 20, 2024, 9:14 PM IST

David Warner Pushpa 2 : భారత్​లో సినిమా, క్రికెట్‌కి భారీ క్రేజ్‌ ఉంది. ఈ రెండు రంగాలకు చెందిన సెలబ్రిటీలకు ఫ్యాన్‌ ఫ్యాలోయింగ్‌ కూడా ఎక్కువే. మరి మైదానంలో సిక్సర్లు కొట్టే స్టార్‌ క్రికెటర్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుంది? అభిమానులకు డబుల్ ధమాకానే. అయితే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బిగ్​ స్క్రీన్​పై కనిపించనున్నాడా? అంటే ఔననే అంటున్నారు నెటిజన్లు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప పార్ట్‌ 1'లోని 'శ్రీవల్లి' పాట గతంలో ఇండియా మొత్తం సూపర్‌ హిట్‌ అయ్యింది. ఈ పాటకు వార్నర్‌ రీల్స్‌ కూడా అప్పట్లో​ ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారాయి. అలాగే మైదానంలోనూ పలుమార్లు 'తగ్గేదేలే' అంటూ బన్నీ మేజనరిజాన్ని అనుసరించిన వార్నర్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అయితే ఈ క్రేజ్‌ని 'పుష్ప 2' లో వినియోగించుకోవాలని డైరెక్టర్‌ సుకుమార్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే 'పుష్ప 2' లో డేవిడ్‌ వార్నర్‌ని చూడవచ్చు!

కీ రోల్​లో వార్నర్?
'పుష్ప 2' లో వార్నర్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడనే వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. డేవిడ్ వార్నర్‌కి సంబంధించిన ఓ స్టిల్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో వార్నర్ చూట్టు ప్రొఫెషనల్​ బౌన్సర్లు ఉన్నారు. వైట్ అండ్ వైట్ ఔట్​ ఫిట్​లో వార్నర్ గన్​ పట్టుకొని స్టైలిష్​గా కనిపిస్తున్నాడు. అయితే ఈ లుక్​ పుష్ప సినిమాలోనిదే అని నెటిజన్లు అంటున్నారు. కానీ, ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. పుష్ప మేకర్స్ నుంచి కూడా దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.

అలా తెలుగు ప్రేక్షకులకు దగ్గర
అయితే వార్నర్‌ - తెలుగు ప్రజల మధ్య మంచి బాండింగ్ ఉంది. వార్నర్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కి ప్రాతినిధ్యం వహించాడు. వార్నర్‌కి తెలుగు అభిమానులు చాలా సపోర్ట్‌ చేశారు. ఈ ప్రేమతో వార్నర్‌ అప్పుడప్పుడు తెలుగు సాంగ్స్‌కి డ్యాన్స్‌ చేస్తు, సినిమా డైలాగులు చెబుతూ రీల్స్‌ చేసేవాడు. ఇలా తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు.

వార్నర్‌ కూడా చాలా సార్లు హైదరాబాద్‌పై, తెలుగు అభిమానులపై ప్రేమ చూపించాడు. చాలా ఇంటర్వ్యూల్లో ఈ విషయం చెప్పాడు. హైదరాబాద్‌ని మిస్‌ అవుతున్నట్లు ఇటీవల ఓ పోస్ట్​ కూడా చేశాడు. ఇలా వార్నర్‌కి హైదరాబాద్‌తో విడదీయరాని బంధం ఏర్పడింది. 2025 ఐపీఎల్ మెగా వేలంలో సన్‌రైజర్స్‌ వార్నర్‌ని తీసుకోవాలని చాలా మంది కోరుతున్నారు.

బన్నీతో ప్రత్యేక అనుబంధం
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లోని పాటలకు స్టెప్పులు వేసి, డైలాగ్స్ మరింత ఆకట్టుకున్నాడు. కరోనా సమయంలో ఆ తర్వాత అల్లు అర్జున్ - వార్నర్ మధ్య స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవకపోయినా ఆన్‌లైన్‌లో చాలా సార్లు పలకరించుకున్నారు. పుట్టిన రోజు సందర్భాల్లో ప్రత్యేకంగా విష్‌ చేసుకొంటారు.

హైదరాబాద్​ను మిస్ అవుతున్న వార్నర్- తెలుగోళ్లతో డేవిడ్ భాయ్ బాండింగ్ అలాంటిది మరి! - David Warner

హాలీవుడ్ రేంజ్​లో వార్నర్ ఎంట్రీ- గ్రౌండ్​లోనే హెలికాప్టర్ ల్యాండింగ్

Last Updated : Sep 20, 2024, 9:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.