ETV Bharat / entertainment

PK ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్ - 3 రోజుల్లోనే షూటింగ్​లు రీ స్టార్ట్! - Pawan Kalyan Upcoming Movies

Pawan Kalyan Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్. అతి త్వరలోనే ఆయన మళ్లీ సినిమా షూటింగుల్లో పాల్గొనున్నారు.

Pawan Kalyan Hari Hara Veera Mallu
Pawan Kalyan Hari Hara Veera Mallu (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2024, 9:39 PM IST

Pawan Kalyan Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్. కొంత కాలంగా సినిమా షూటింగ్​లకు దూరంగా ఆయన, పెండింగ్​లో ఉన్న ఫిల్మ్ ప్రాజెక్ట్​లను పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 23 నుంచి సినిమా షూటింగు​ల్లో పాల్గొననున్నారు. తొలుత 'హరి హర వీరమల్లు' మూవీయూనిట్​తో ఆయన పని చేయనున్నారు. విజయవాడలో జరిగే కొత్త షెడ్యూల్ చిత్రీకరణలో పవన్ పాల్గొనబోతున్నట్లు ఆ చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ ప్రకటించింది.

ఈ షెడ్యూల్​లో భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నారు. దాదాపు 400 మందితో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారట. ఇది హాలీవుడ్ ప్రముఖ స్టంట్ మాస్టర్ నిక్ పావెల్ ఆధ్వర్యంలో జరగనున్నట్లు తెలిసింది. పవన్ మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టడం పట్ల అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. సుదీర్ఘ విరామం తర్వాత ఆయనతో కలిసి నటించేందుకు నటీనటులు, పనిచేసేందుకు సాంకేతిక సిబ్బంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా, ఈ షెడ్యూల్ కంప్లీట్​ అయితే 'హరిహర వీరమల్లు' మొదటి భాగం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటుందట. ఇక వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక సీనియర్ డైరెక్టర్లు క్రిష్, జ్యోతి కృష్ణ ఈ సినిమాను పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక పవన్​తోపాటు నిధి అగర్వాల్, పూజిత పొన్నాడ, నోరా ఫతేహీ, అర్జున్ రాంపాల్, బాబీ దేవోల్ ఆయా పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మరోవైపు పవన్ చేతిలో 'ఓజీ', 'ఉస్తాద్ భగత్​సింగ్' సినిమాలు కూడా ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాల షూటింగ్​లకు కూడా ఆయన పాల్గొనే ఛాన్స్ ఉంది. ఓజీకి సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా, యంగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ 'ఉస్తాద్ భగత్​సింగ్' తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలను కూడా త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ చేయాలని ఆయా చిత్రాల మేకర్స్ భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.