తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎవరైతే మాకేంటి? - సీఎం సోదరుడికి 'హైడ్రా' షాక్ - నెలలోగా ఇల్లు కూల్చేయాలని అల్టిమేటమ్ - Hydra Notices To CM Revanth Brother - HYDRA NOTICES TO CM REVANTH BROTHER

Hydra Notices to CM Revanth Reddy Brother : హైదరాబాద్​లో అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను ఆక్రమించి చేసిన నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తోంది. అధికారం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అక్రమార్కులపై చర్యలకు ఉపక్రమిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏకంగా ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డికే నోటీసులు ఇచ్చారు.

Hydra Notices to CM Revanth Reddy Brother Tirupati
Hydra Notices to CM Revanth Reddy Brother Tirupati (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2024, 10:00 AM IST

Updated : Aug 29, 2024, 2:40 PM IST

Hydra Notices to CM Revanth Reddy Brother Tirupati Reddy : చెరువులు, నాలాలపై ఇళ్లు నిర్మించుకున్న వారిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా గుబులు రేపుతోంది. ‘హైడ్రా’ కూల్చివేతలతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. తాజాగా దుర్గం చెరువులోని కాలనీల్లోని అక్రమ కట్టడాలపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలోని 204 ఇళ్లకు ఇటీవల జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులిచ్చారు.

హైటెక్‌సిటీలోని రాయదుర్గ్, మాదాపూర్‌ గ్రామాల పరిధిలో దుర్గం చెరువు చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు వెలిసిన విషయం తెలిసిందే. ఈ భవనాల్లో సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు కూడా ఉంది. ఈ ఇంటికి తాజాగా హైడ్రా అధికారులు నోటీసులు అంటించారు. మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతిరెడ్డి నివాసం ఉండగా ఆ ఇల్లు ఎఫ్​టీఎల్ పరిధిలో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు.

రాంనగర్‌లో ఆక్రమణలు పరిశీలించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ - Ranganath Visit To Musheerabad

మరోవైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు పలు కార్యాలయాలకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి, పలువురు ఐఏఎస్, ఐఆర్‌ఎస్‌ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉన్నాయి. నెలలోగా ఈ అక్రమ కట్టడాలు కూల్చేయాలని స్పష్టం చేశారు.

100ఎకరాల చెరువును 84కుదించి :కాగా దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లోని నిర్మాణాలకు గతంలోనే అధికారులు మార్క్ చేశారు. నాన్ డెవలప్‌మెంట్ జోన్‌గా దుర్గం చెరువును గుర్తించారు. సుమారు 100 ఎకరాలు ఉన్న దుర్గం చెరువు 84 ఎకరాలకు తగ్గినట్లు అధికారులు గుర్తించి పలు సెలబ్రిటీలు, అధికారులు, రాజకీయ నేతలకు నోటీసులు జారీ చేశారు. అయితే రెవెన్యూ అధికారుల నోటీసులపైన నిర్మణదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులపై కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు తిరుపతిరెడ్డి కార్యాలయం, నివాసం చిత్రీకరించేందుకు వచ్చిన మీడియా సిబ్బందిని అతని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

శేరిలింగంపల్లిపై హైడ్రా ఫోకస్​​ :మరోవైపు చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలోని నిర్మాణదారులకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని ఆక్రమణలు తొలగించాలని ఆదేశాలిచ్చింది. రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.

రెవెన్యూ నోటీసులపై మల్లారెడ్డి అల్లుడికి ఊరట- వారం రోజులే డెడ్‌లైన్‌ - Notices To Marri Rajashekar Reddy

ఓఆర్‌ఆర్‌ ఆవలకూ హైడ్రా బుల్డోజర్లు! - విస్తరణ దిశగా సర్కార్​ అడుగులు - State Govt Plan To HYDRA Expansion

Last Updated : Aug 29, 2024, 2:40 PM IST

ABOUT THE AUTHOR

...view details