Hyderabad Police On Minor Vehicle Driving : పట్టుమని పదేళ్లు కూడా రాకున్నా అప్పుడే బైక్ నడపడానికి ఆసక్తి చూపిస్తున్నారు నేటి తరం అబ్బాయి. పదిహేనేళ్ల అబ్బాయిలే బైకులు నడుపుతూ రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు గురి కావడమో లేక ప్రమాదాలు చేయడమో వంటి ఘటనలు జరుగుతున్నాయి. తెలిసీ తెలియని వయసులో వేగంగా నడుపుతూ హీరోల్లా ఫీలవుతున్నారు. అడ్డూ అదుపు లేకుండా దూసుకెళ్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేక ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో రోడ్డుప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీనికి ముఖ్యకారణం చాలామంది మద్యం తాగి వాహనాలు నడపడం కాగా మరొకటి మైనర్ల డ్రైవింగ్.
Hyderabad Police Counter To Netizen: తాజాగా మైనర్ బాలుడి డ్రైవింగ్‌పై ఓ నెటిజన్ చేసిన పోస్టుకు హైదరాబాద్ సిటీ పోలీసులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీర్ చౌక్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో ద్విచక్ర వాహనంపై ఉన్న బాలుడు ఫొటోను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. చూడండి పదేళ్ల బాలుడు బైక్ నడుపుతున్నాడంటూ హైదరాబాద్ సిటీ ట్రాఫిక్, చార్మినార్ పోలీసులకు ట్యాగ్ చేశాడు. వెంటనే స్పందిచిన పోలీసులు లొకేషన్, బండి నంబర్, టైమ్ చెప్పాల్సిందిగా కోరారు. దీనికి తాను ఎలా పంపిస్తానంటూ సమాధానం ఇచ్చాడు. చార్మినార్ సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ ఉందని అయినా అధికారం ఉండి కూడా కనుక్కోవడానికి ధైర్యం చేయడం లేదని విమర్శించాడు.
పుణె రాష్ డ్రైవింగ్ కేసులో మైనర్ బెయిల్ రద్దు- 15 రోజుల రిమాండ్! - Pune Porsche Accident