Husband Harassing Pregnant Wife in Hyderabad :ఆడపిల్ల పుడుతుందేమోనన్న అనుమానంతో ఓ మూర్ఖుడు నిండు గర్భవతిని ఇంట్లో నుంచి గెంటేసిన ఘటన హైదరాబాద్‌లో రాజేంద్రనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల మేరకు రాజేంద్రనగర్‌లో అక్బర్‌ఖాన్, హుమెరా దంపతులు నివసిస్తున్నారు. పెళ్లైనా మొదట్లో ఇద్దరు ఆనందంగానే ఉన్నారు. మొదటిసారి వారికి కుమార్తె జన్మించింది. అంతే ఆడపిల్ల పుట్టిందని అప్పటి నుంచి వేధింపులకు దిగాడు అక్బర్. కుమార్తె జన్మించిన తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని పుట్టింటికి పంపించాడు. మెట్టినింటిలో కుమార్తె జీవితం ముఖ్యమని భావించిన ఆ తల్లిదండ్రులు వారు అడిగినట్లే ఇచ్చి పంపించారు.
కుమార్తె పుట్టడంతో మార్పు :తర్వాత కొన్నిరోజులు బాగానే ఉన్నారు. రెండోసారి గర్భవతైన హుమెరా మళ్లీ కుమార్తెకు జన్మించింది. మళ్లీ కుమార్తె జన్మించిందని కోపానికి గురైన అక్బర్ వేధింపులు తీవ్రతరం చేశాడు. కొట్టడం, డబ్బులు అడగటం, ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో నుంచి పంపిచేయడం వంటివి చేసేవాడు. భర్త వేధింపులు తాళలేక రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పలుమార్లు ఫిర్యాదు చేసింది హుమెరా. అయినా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. వేధింపులు మరింత ఎక్కువ కావడం ఇంతకు ముందు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
మందుతాగి భర్తల వేధింపులు- పెళ్లి చేసుకున్న వారి భార్యలు! ఎక్కడో తెలుసా?