తెలంగాణ

telangana

ETV Bharat / state

వృద్ధ దంపతులను బెదిరించి భారీ చోరీ - 70 తులాల బంగారం, రూ.8 లక్షల నగదు అపహరణ - HUGE ROBBERY OF GOLD IN HUZURABAD

కరీంనగర్ జిల్లాలో భారీ చోరీ - ఆదివారం రాత్రి ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు - 70 తులాల బంగారం, 8లక్షల డబ్బు చోరీ

Gold Robbery In karimnagar
Huge Robbery Of Gold In Huzurabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2025, 11:35 AM IST

Updated : Feb 24, 2025, 12:06 PM IST

Huge Robbery Of Gold In Huzurabad : కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్​లో భారీ చోరీ జరిగింది. ప్రతాపవాడకు చెందిన రాఘవరెడ్డి ఇంట్లోకి ఆదివారం రాత్రి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న రాఘవరెడ్డి, అతని భార్యపై దాడి చేశారు. మెడపై కత్తులు పెట్టి బెదిరించి ఇంట్లో ఉన్న 70 తులాల బంగారు ఆభరణాలు, రూ.8 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.

బాధితుల చరవాణిలను తీసుకెళ్లి బయటపడేశారు. విషయం తెలుసుకొని వచ్చిన రాఘవరెడ్డి కుటుంబీకులు వచ్చి గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ తిరుమల్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వేలి ముద్రలు, నిపుణులు, డ్వాగ్ స్క్వాడ్​ను రంగంలోకి దింపారు. కుటుంబ సభ్యుల మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

"రాత్రి మూడు గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. కత్తి మెడపై పెట్టి బెదిరించారు. టవల్​తో నోరు, కాళ్లు కట్టేసి దాడి చేస్తూ డబ్బులు ఎక్కడ దాచిపెట్టారో చెప్పాలన్నారు. ఇంట్లో 70 తులల బంగారం, రూ.8 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. వెంటనే మా కుమారులకు ఫోన్ చేశాను. 100 డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాను."- బాధితురాలు

కిలాడీ లేడీలు - మంచినీళ్లు అడిగారు, 12 తులాల బంగారం చోరీ చేశారు

ధనవంతుల ఇంట్లోనే పనికి చేరతారు - అదును చూసి దోచేస్తారు

Last Updated : Feb 24, 2025, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details