Rs.1.21 Crore Hawala Cash Seized in Hyderabad :హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా హవాలా డబ్బు పట్టుపడింది. వాహన తనిఖీలలో రూ.1 కోటి 21 లక్షలు పట్టుబడింది. సుల్తాన్ బజార్ పోలీసులు మంగళవారం సాయంత్రం బొగ్గులకుంటలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా బైక్ పై వస్తున్న ఇద్దరిని పోలీసులు ఆపేందుకు యత్నించారు. వారు పోలీసులను తప్పించుకొని పోవడంతో కోఠి హనుమాన్ టెక్డి వద్ద వారిని పోలీసులు పట్టుకున్నారు.
హైదరబాద్‌లో భారీగా హవాలా మనీ - రూ. 1.21 కోట్ల నగదు సీజ్ - Huge Hawala Money Seized in Hyd - HUGE HAWALA MONEY SEIZED IN HYD
Huge Hawala Cash Seized by Police : హైదరాబాద్ నగరంలోని సుల్తాన్‌బజార్‌లో భారీ మొత్తంలో హవాలా డబ్బు పట్టుబడింది. వాహన తనిఖీలలో రూ.1.21 కోట్ల నగదును పోలీసులు గుర్తించి, సీజ్ చేశారు. ఈ హవాలా డబ్బు తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Published : Oct 1, 2024, 10:57 PM IST
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్ (27), వసంత్ ( 24) లు అనుమానాస్పదంగా, ఓ బ్యాగ్‌ను తరలిస్తుండటం గమనించారు. ఆ బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో కోటి రూపాయల నగదు పట్టుబడింది. వారిని విచారించగా, తమకు ఆ డబ్బుతో ఎలాంటి సంబంధం లేదని తన ప్రతినిధి ఆదేశాల మేరకు డబ్బులను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి ఇచ్చిన సమాచారంతో హనుమాన్ వ్యాయామశాల వద్ద ఉన్న ఓ అపార్ట్మెంట్లో తనిఖీ చేయగా, అక్కడ రూ.21 లక్షలు పట్టుబడ్డాయి. అక్కడ ఉన్న మరోవ్యక్తి తరుణ్‌ను విచారించగా, ముంబయిలో ఉండే బబ్లూ అనే హవాలా వ్యాపారి ఆదేశాల అనుసారంగా, తాము పని చేస్తున్నామని తరుణ్ తెలిపాడు.
నగరంలో ఉండే వ్యాపారుల నుంచి ఈ లావాదేవీలు సాగిస్తున్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వెల్లడించారు. హవాలా డబ్బు తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.1.21 కోట్ల నగదు సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు బబ్లూను త్వరలో అరెస్ట్ చేస్తామని డీసీపీ వివరించారు.