How to Apply for Aadhaar Card Franchise :దేశంలో ఆధార్ కార్డు ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు పొందాలన్నా, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు.. ఇలా ఎక్కడ ఏ పని జరగాలన్నా ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఉండాల్సిందే. కాబట్టి, అంతటి ప్రాధాన్యమున్న ఆధార్లో ఏమైనా తప్పులు ఉన్నా లేదా చిన్నారులు, లేనివారు కొత్తగా ఆధార్ కార్డు పొందాలన్నా ఆధార్ సెంటర్కి వెళ్లాల్సిందే.
దీనిని బట్టి చూస్తే ఆధార్ సెంటర్లకు ఏ విధమైన డిమాండ్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆదాయం కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు! అయితే, నేటికి చాలా చాలా ప్రాంతాలలో ఆధార్ సెంటర్లు లేక చాలా మంది దూరప్రాంతాలకు వెళ్తున్నారు. కాబట్టి, ఈ నేపథ్యంలో మీరే కొత్తగా ఒక ఆధార్సెంటర్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారా? మరి, ఇంకెందుకు ఆలస్యం కొత్తగా ఆధార్ ఫ్రాంఛైజీని పొందాలంటే ఏం చేయాలి? అందుకు సంబంధించిన ప్రాసెస్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మీరు కొత్తగా ఆధార్ సెంటర్ ఓపెన్ చేయాలనుకుంటే.. మొదట దాని కోసం UIDAIనిర్వహించే పరీక్షలో పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే మీకు ఈ సేవా కేంద్రాన్ని స్టార్ట్ చేయడానికి లైసెన్స్ మంజూరు చేస్తారు. అప్పుడు మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాలి. ఆ తర్వాత.. కామన్ సర్వీస్ సెంటర్ నుంచి రిజిస్ట్రర్ చేసుకోవాలి. ఇక కొత్త ఆధార్ ఫ్రాంఛైజీ పొందడానికి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.