Priyanka Chopra Visits Chilkur Balaji Temple : ప్రముఖ హాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మంగళవారం (జనవరి 21న) సందర్శించారు. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్టు ఆ పోస్టులో రాసుకొచ్చారు. భగవంతుడి దయ అనంతమైందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు జోడించారు. అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు.
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి, అపోలో సంస్థల వైస్ ఛైర్పర్సన్ ఉపాసనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లవ్ ఎమోజీలను జోడించారు. దీనిపై ఉపాసన స్పందిస్తూ 'మీ కొత్త సినిమా మంచి విజయం అందుకోవాని ఆకాంక్షిస్తున్నా. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఉంటాయి' అని రిప్లై ఇచ్చారు.
మహేష్ బాబుతో నటించడానికేనా : బాలీవుడ్‌లో అత్యంత పెద్ద స్టార్‌గా రాణించి ఆ తర్వాత హాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ ప్రియాంక చోప్రా బిజీ అయ్యారు. అమెరికాకు చెందిన నిక్ జొనాస్‌ను వివాహం చేసుకున్నారు. లాస్ ఏంజెల్స్ నుంచి ఆమె కొన్ని రోజుల కిందట హైదరాబాద్‌కు వచ్చారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించనున్న SSMB29 (వర్కింగ్ టైటిల్)లో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఎంపికయ్యారంటూ ఇటీవల చాలా వార్తలొచ్చాయి. ఆ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్ వచ్చారంటూ నెట్టింట పలు చర్చలు కూడా జరిగాయి. ఆ సినిమాను ఉద్దేశించే కొత్త ప్రయాణమని చెప్పినట్టు పలువురు సినీ అభిమానులు ఆ పోస్టును చూసి కామెంట్లను పెడుతున్నారు. రామ్ చరణ్, ప్రియాంక కలిసి గతంలో ‘జంజీర్’ (తెలుగులో తుఫాన్) సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే.
'అస్సలు సినిమాలు వద్దు అంది- ఆ చిత్రానికి ఏడుస్తూనే సంతకం చేసింది!'
కిరాక్ పోజుల్లో ప్రియాంక చోప్రా, సమంత - ఓ లుక్కేశారంటే మళ్లీ మళ్లీ చూడాల్సిందే! - Samantha Priyanka Chopra