AP High Court Comments on Social Media Posts: సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టుల పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయమూర్తులను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని వెల్లడించింది. పోలీసులు పెట్టిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించాలని కాని పిల్ వేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు చట్టనిబంధనలకు అనుగుణంగా పోస్టులు పెడుతుంటే తాము ఎలా నిలువరించగలమని వ్యాఖ్యానించింది. పిల్లో తగిన ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం వెల్లడించింది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు మూకుమ్మడిగా కేసులు పెట్టడంపై జర్నలిస్ట్ విజయబాబు వేసిన పిల్‌పై హైకోర్ట్ విచారణ జరిపింది.
అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై కేసులు పెడితే తప్పేంటి? : హైకోర్టు - HIGH COURT ON SOCIAL MEDIA POSTS
అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై కేసులు పెడితే తప్పేముందన్న హైకోర్టు - జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని వ్యాఖ్యానించిన ధర్మాసనం
high_court_on_social_media_posts (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 13, 2024, 3:17 PM IST