తెలంగాణ

telangana

ETV Bharat / state

నారాయణపేట జిల్లా చందాపూర్ శివారులో కాలువకు గండి - TELANGANA RAINS LIVE UPDATES TODAY

Rains In Hyderabad
Heavy Rains In Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 20, 2024, 6:50 AM IST

Updated : Aug 20, 2024, 10:33 AM IST

Heavy Rains In Hyderabad : హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వేకువజాము నుంచి దంచికొడుతున్న వర్షంతో నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. పలు ప్రధాన రహదారుల్లో మోకాళ్లలోతుకు వర్షపు నీరు చేరుకుంది. మరో 2 గంటల పాటు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది.

LIVE FEED

10:32 AM, 20 Aug 2024 (IST)

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టిన వర్షం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టిన వర్షం

మధ్యాహ్నం 2 గంటల తర్వాత మళ్లీ ప్రారంభంకానున్న వర్షం

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం: వాతావరణ శాఖ

10:32 AM, 20 Aug 2024 (IST)

నారాయణపేట: మక్తల్ మండలం చందాపూర్ శివారులో కాలువకు గండి

నారాయణపేట: మక్తల్ మండలం చందాపూర్ శివారులో కాలువకు గండి

సంగం బండ నుంచి వచ్చే కాలువకు గండి, వృథాగా పోతున్న నీరు

10:19 AM, 20 Aug 2024 (IST)

వర్షం ధాటికి కూలిన ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ

హైదరాబాద్‌: వర్షం ధాటికి కూలిన ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ

బషీర్‌బాగ్‌ సీసీఎస్‌ పాత కార్యాలయం వైపు కూలిన ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ

ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కూలి పోలీసు వాహనాలు ధ్వంసం

గద్వాల: భారీ వర్షాల దృష్ట్యా గట్టు, అయిజ మండలాల్లోని విద్యాసంస్థలకు సెలవు

కలెక్టర్‌ ఆదేశాలతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన గద్వాల జిల్లా డీఈవో

9:57 AM, 20 Aug 2024 (IST)

హైదరాబాద్‌: భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తమైన జలమండలి

జీఎం, డీజీఎం, మేనేజర్‌తో జలమండలి ఎండీ జూమ్‌ సమావేశం

క్షేత్రస్థాయిలో పర్యటించాలని అధికారులకు జలమండలి ఎండీ సూచన

వాటర్ లాగింగ్ పాయింట్స్‌పై దృష్టి పెట్టాలని జలమండలి ఎండీ ఆదేశం

ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలి: జలమండలి ఎండీ

వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తితే 155313కి ఫోన్‌ చేయాలని జలమండలి సూచన

మరో రెండ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ

భారీ వర్షాల దృష్ట్యా జలమండలి ఉద్యోగులకు, సిబ్బందికి సెలవులు రద్దు

9:38 AM, 20 Aug 2024 (IST)

హుస్సేన్‌సాగర్ హుస్సేన్‌సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు

ఎడతెరిపి లేని వర్షాలకు నిండుకుండలా మారిన హుస్సేన్‌సాగర్ హుస్సేన్‌సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 514.75 మీటర్లు

9:19 AM, 20 Aug 2024 (IST)

వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలంలో భారీ వర్షం

వర్షాలతో తెబ్బేరు-కొల్లాపూర్‌ మధ్య రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం

వెంకటాపురం వద్ద నూతంగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణంపై భారీగా వరద నీరు

వంతెన నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం

9:19 AM, 20 Aug 2024 (IST)

ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు ప్రాంతాల్లో బారీ వర్షం

గడిచిన 24 గంటల్లో సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు

సిద్దిపేట జిల్లా: ధూల్‌మిట్టలో అత్యధికంగా 11 సెం. మీ వర్షపాతం

జగదేవ్‌పూర్ మం. చట్లపల్లిలో 9.7 సెం.మీ, కోడకండ్లలో 9 సెం.మీ వర్షపాతం

కొమురవెళ్లిలో 8.4 సెం.మీ వర్షపాతం నమోదు

సంగారెడ్డి జిల్లా: బీహెచ్ఈఎల్‌లో 9.2 సెం. మీ వర్షపాతం నమోదు

రామచంద్రపురంలో 9 సెం.మీ, అమీన్‌పూర్‌లో 6.5 సెం.మీ వర్షపాతం నమోదు

మెదక్ జిల్లా పాతురులో 4.1 సెం.మీ వర్షపాతం నమోదు

9:09 AM, 20 Aug 2024 (IST)

సికింద్రాబాద్ పరిసరాల్లో ఇళ్లలోకి వరద నీరు

సికింద్రాబాద్: జవహర్‌నగర్, పాపయ్య నగర్, సంతోష్‌నగర్‌లో ఇళ్లలోకి చేరిన వరద

జవహర్‌నగర్‌లోని పలు కాలనీలలో చెరువులను తలపిస్తున్న రహదారులు

భారీ వర్షాలకు ఇళ్లలోకి చేరిన వరద నీరు, స్థానికులకు తీవ్ర ఇబ్బందులు

9:09 AM, 20 Aug 2024 (IST)

మలక్‌పేట ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు

మలక్‌పేట ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు

హైదరాబాద్‌: వరదతో వాహనాల రాకపోకలకు అంతరాయం

9:08 AM, 20 Aug 2024 (IST)

కుత్బుల్లాపూర్‌లోని పలు కాలనీల్లోని ఇళ్లలోకి చేరిన వరద నీరు

వెంకటేశ్వర నగర్, ఇందర్‌సింగ్ నగర్, వాణి నగర్‌లలో ఇళ్లలోకి చేరిన వరద

ప్రశాంతి నగర్‌ వద్ద నాలా పొంగి రహదారుల్లోకి ప్రవహిస్తున్న వరద

న్యూబోయిన్‌పల్లి హర్షవర్ధన్ కాలనీలో వరద ఉద్ధృతి

చింతల్, శ్రీనివాస్ నగర్ వీధుల్లో రోడ్లను ముంచెత్తిన వరద

8:28 AM, 20 Aug 2024 (IST)

హైదరాబాద్​లో మోస్తరు వర్షాలతో పాటు గట్టి జల్లులు పడే అవకాశం

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ కూడా వర్షాలు

హైదరాబాద్​లో మోస్తరు వర్షాలతో పాటు గట్టి జల్లులు పడే అవకాశం

ఉదయం 10.30 తర్వాత వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

8:16 AM, 20 Aug 2024 (IST)

జీహెచ్‌ఎంసీ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు సెలవు

రంగారెడ్డి జిల్లా పరిధిలోని జీహెచ్‌ఎంసీ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు సెలవు

వర్షం కారణంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని పాఠశాలలకు సెలవు ప్రకటించిన డీఈవో

8:14 AM, 20 Aug 2024 (IST)

భారీ వర్షానికి సనత్‌నగర్ నుంచి కొట్టుకొచ్చిన వ్యక్తి మృతదేహం

భారీ వర్షానికి సనత్‌నగర్ నుంచి కొట్టుకొచ్చిన వ్యక్తి మృతదేహం
వరదలకు పార్శిగుట్ట నుంచి రామానగర్‌ రోడ్డుపైకి కొట్టుకొచ్చిన వ్యక్తి మృతదేహం

మృతుడు రామ్‌నగర్‌కు చెందిన అనిల్‌గా గుర్తింపు

7:40 AM, 20 Aug 2024 (IST)

మలక్‌పేట అజాంపుర వద్ద భారీగా వరద ప్రవాహం

హైదరాబాద్​లోని మలక్‌పేట అజాంపుర వద్ద భారీగా వరద ప్రవాహం

దబీర్‌పురా వద్ద వరద ప్రవాహంతో నిలిచిపోయిన రాకపోకలు

నాలా పొంగి నల్గొండ చౌరస్తా నుంచి మలక్‌పేట రైల్వేస్టేషన్‌ వరకు రోడ్డుపై నీటిప్రవాహం

7:38 AM, 20 Aug 2024 (IST)

పంజాగుట్టలోని అపార్టుమెంట్‌ వద్ద పిడుగుపాటు

హైదరాబాద్​లోని పంజాగుట్ట కాలనీ సుఖ్ నివాస్ అపార్టుమెంట్‌ వద్ద పిడుగుపాటు

షెడ్డుపై పిడుగు పడి కారు ధ్వంసం, తెగిపడిన విద్యుత్ తీగలు

7:08 AM, 20 Aug 2024 (IST)

మరో రెండు గంటల పాటు భారీ వర్షం

హైదరబాద్​లో భారీ వర్షాలకు అలర్ట్ అయిన జీహెచ్ఎంసీ డిజాస్టర్ సిబ్బంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. మరోవైపు వాతావరణశాఖ హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. ఏదైనా సమస్య తలెత్తితే 040-21111111, 9000113667 నంబర్లకు కాల్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. పలుచోట్ల జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

6:59 AM, 20 Aug 2024 (IST)

పార్సిగుట్టలో వర్షపు నీటిలో కొట్టుకుపోయిన గుర్తుతెలియని వ్యక్తి

పార్సిగుట్టలో వర్షపు నీటిలో కొట్టుకుపోయిన గుర్తుతెలియని వ్యక్తి

పార్సిగుట్టలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షానికి కొట్టుకుపోయిన కార్లు
భారీగా వరద రావడంతో ప్రమాద అంచుల్లో పార్సిగుట్టలో పలు ప్రాంతాలు
ముషీరాబాద్‌, రామ్‌నగర్, పార్సిగుట్ట, బౌద్ధనగర్ ప్రాంతాల్లో భారీగా చేరిన వర్షపు నీరు
హైదరాబాద్‌లో వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు

6:57 AM, 20 Aug 2024 (IST)

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం
ఎడతెరిపి లేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం
భారీ వర్షాలకు అలర్ట్ అయిన జీహెచ్ఎంసీ, డిజాస్టర్ సిబ్బంది
అనవసరంగా ఎవరూ బయటకు రావద్దని కోరుతున్న అధికారులు
ఏదైనా సమస్యకు టోల్‌ఫ్రీ 040-21111111, 9000113667కు సంప్రదించాలని సూచన

6:38 AM, 20 Aug 2024 (IST)

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌, నాగోల్‌, అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్‌, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్ పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్‌ బషీరాబాద్, జీడిమెట్లలో కుండపోత వర్షం కురుస్తోంది. వనస్థలిపురం, బిఎన్‌ రెడ్డి నగర్, హయత్‌నగర్‌, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షం మంగళవారం వేకువజామును మరోసారి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాలిలోతు వరకు నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.

Last Updated : Aug 20, 2024, 10:33 AM IST

ABOUT THE AUTHOR

...view details