Heavy Rains In AP: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీలోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇది మళ్లీ బలపడుతుంద? లేక బలహీనపడుతుందా అనే దానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతున్న నేపథ్యంలో మేఘాలు కమ్ముకుని చిరు జల్లులు పడుతున్నాయి. దాంతో పాటు చల్లటి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలో రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఏపీలో భారీ వర్షాలు : మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం,శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.