తెలంగాణ

telangana

ETV Bharat / state

విధుల్లో ఉండగా హెడ్ కానిస్టేబుల్​కు హార్ట్ ఎటాక్ - ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి - HEARTATTACK TO HEAD CONSTABLE

డోర్నకల్ పోలీస్ స్టేషన్​లో హెడ్ కానిస్టేబుల్ పోలోజు సోమేశ్వర్​కు గుండెపోటు - ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి

HeartAttack to Head Constable Poloju Someshwar
HeartAttack to Head Constable Poloju Someshwar (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 2, 2025, 4:31 PM IST

HeartAttack to Head Constable Poloju Someshwar :మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్​లో విషాదం అలుముకుంది. హెడ్ కానిస్టేబుల్ పోలోజు సోమేశ్వర్ (51) గుండెపోటుతో మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే, శనివారం రాత్రి ఆయన ఠాణాలో విధుల్లో ఉన్న క్రమంలో ఛాతిలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలారు. పోలీస్ సిబ్బంది హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు.

హెడ్ కానిస్టేబుల్ పోలోజు సోమేశ్వర్ స్వస్థలం దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామం. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమేశ్వర్ మృతదేహాన్ని స్వగ్రామమైన పెద్దముప్పారం తీసుకొచ్చారు. సోమేశ్వర్ పార్థివదేహానికి జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా కల్పించారు. ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details