Gruha Jyothi Scheme in Telangana : గృహజ్యోతి పథకంలో భాగంగా తొలుత హైదరాబాద్‌లో 11 లక్షల మంది వినియోగదారులకే వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరి వివరాలన్నీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు (సీజీజీ) చేరాయి. మార్చి నెలలో వీరికి మాత్రమే సున్నా బిల్లులు జారీ కానున్నాయి. త్వరలో పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఎంతమందికి వర్తిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
200 Units Free Power in Hyderabad : ప్రజాపాలనలో గృహజ్యోతికి అర్జీ చేసుకున్న వినియోగదారుల ధ్రువీకరణ ప్రక్రియని, వివరాల సేకరణను విద్యుత్ సిబ్బంది బిల్లుల జారీ సమయంలో చేపట్టారు. ఇది ఇంకా కొనసాగుతోంది. టీఎస్‌ఎస్పీడీసీఎల్ పరిధిలో ఇప్పటివరకు 30 లక్షల వినియోగదారుల వివరాలను పరిశీలన పూర్తి చేసి పథకం అమలు కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)కి సమర్పించారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన వినియోగదారులు 11 లక్షల వరకు ఉన్నారు. ఆహారభద్రత కార్డు తప్పనిసరి అనడంతో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో 55 శాతం మందికి మాత్రమే గృహజ్యోతి వర్తించే అవకాశం కన్పిస్తోంది. తెలంగాణ సర్కార్ జారీ చేసే మార్గదర్శకాలను బట్టి వీరి శాతం తగ్గొచ్చు లేదంటే పెరగొచ్చు. ప్రజాపాలనలో 19.85 లక్షల మంది అర్జీ చేసుకున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
ఈనెల 27న సాయంత్రం రెండు గ్యారంటీలను ప్రారంభిస్తాం : రేవంత్ రెడ్డి
హబ్సిగూడలో అత్యధికం :గృహజ్యోతి(Gruha Jyothi Scheme) కోసం పరిశీలన పూర్తయిన వినియోగదారులు అత్యధికంగా హబ్సిగూడ సర్కిల్ పరిధిలో ఉన్నారు. ఇక్కడ 1.62 లక్షల మంది ఇళ్లకు ఉచిత కరెంట్వర్తించే అవకాశం ఉంది. రాజేంద్రనగర్ సర్కిల్‌లో 1.59 లక్షలు, సరూర్‌నగర్ సర్కిల్‌లో 1.47 లక్షలు, హైదరాబాద్ సౌత్‌లో 1.27 లక్షల వినియోగదారుల పరిశీలన పూర్తయింది. బంజారాహిల్స్ సర్కిల్‌లో 59,000ల వినియోగదారులు గృహజ్యోతి కోసం వివరాలు ఇవ్వగా మిగతా సర్కిళ్లలో లక్షలోపే ఉన్నారు. ఈ నెల 16 వరకు 10 లక్షల మంది వివరాలను విద్యుత్ సిబ్బంది సేకరించగా, ఈ పది రోజుల్లో మరో లక్ష దాకా మాత్రమే అదనంగా మ్యాపింగ్ చేశారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే కార్యాలయాలకు వచ్చి వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.