Pencil Artist Ganesh Story : కష్టాలు, కన్నీళ్లు, కుటుంబ పోషణ ఇవన్నీ ఆయువవకుని కల ముందు చిన్నబోయాయి. ఎన్ని కష్టాలు వచ్చిన తనలో ఉన్న దృఢసంకల్పం తన కలకు ఊపిరి పోస్తోంది. చూస్తున్నారుగా ఈ చిత్రాలు ఎంత బాగా గీశాడో కదా! మెుబైల్‌లో ఫొటో పంపిస్తే చాలు. అచ్చం అలాంటి బొమ్మనే గీసేస్తున్నాడు. అలా అని మనోడేం పెద్ద కళాకారుడు కాదండోయ్! ఓ మారుమూల గ్రామం. నిరుపేద కుటుంబంలో పుట్టాడు. కష్టాలను దిగమింగుకుని కన్నతల్లికి అండగా ఉంటున్నాడు. మరోవైపు తన చిత్రాలతో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.
23 ఏళ్లకే లస్సీ డే కేఫ్ వ్యాపారం- యశ్వంత్ సక్సెస్ జర్నీ సాగిందిలా
చిత్రాన్ని గీయడంలో తనకు తానే దిట్ట అనిపించుకుంటున్నాడు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన గణేష్ అనే యువకుడు. తాను 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు. డిగ్రీ చడుతుండగా తండ్రి మృతి చెందాడు. తల్లి నాగవ్వ, పెద్దమ్మ లక్ష్మి ఒకేచోట నివసిస్తున్నారు. కుటుంబ పోషణ భారంగా మారింది. తల్లి బీడీలు చేస్తూ కుటుంబ పోషణ జరుపున్నది. గణేష్ చదువు మాని పెట్రోల్ పంపులో పనిచేస్తూ తల్లికి చెదోవాదోడుగా మారాడు.
అయితే చిన్ననాటి నుంచి బొమ్మలు గీయడం అంటే ఎంతో ఇష్టం. దేవత మూర్తులు, సినిమా కళాకరులు, క్రీడాకారులు, సాధారణ వ్యక్తులు ఇలా ఎవరి చిత్రమైన సరే ఇట్టే వేసేస్తాడు. ఆ కల తనకు భారంగా మారద్దనుకున్నాడు. సరదాగా వేసే కళాకృతులను ఉపాధిలో భాగంగా మలుచుకున్నాడు. పుట్టిన రోజుకు, పెళ్లిళ్లకు బహుమతులు అందజేయాలనుకునే వారికి చిత్రాలు గీసిస్తూ సంపాదనగా మార్చుకున్నాడు. ఈ కలను ఇలాగే కొనసాగిస్తూ ఏదో ఒక రోజు ఓ గొప్ప గుర్తింపు పొందాలని ఆశగా ఎదురు చూస్తున్నాడు ఈ యువకుడు.