Gaddam Ranjith Got Government Jobs Story :కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగం సాధించగలమని విశ్వసిస్తుంటారు ఉద్యోగార్థులు. కానీ ఈ యువకుడు మాత్రం స్వీయప్రతిభనే నమ్ముకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని సొంతంగానే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడినా ఎన్నో వ్యయ ప్రయాసలు పడి వరసగా 4 ఉద్యోగాలను ఒడిసిపట్టాడు. దృఢనిశ్చయానికి నిరంతర శ్రమ తోడైతే ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నాడు.
ఈ యువకుడి పేరు గడ్డం రంజిత్. స్వస్థలం వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని సూరిపల్లి గ్రామం. ఇతనిది నిరుపేద వ్యవసాయ కుటుంబం కావడంతో ఎన్నో ఇక్కట్ల మధ్యే చదువు కొనసాగించాడు. తల్లిదండ్రుల మద్దతుతో హైదరాబాద్‌లోని పల్లవి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తిచేశాడు. తర్వాత ప్రభుత్వ కొలువు దక్కించుకోవాలనే తపనతో మిత్రులతో పాటు దిల్‌సుఖ్‌నగర్‌లోని ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.
చదువు కెరీర్‌గా, ఆటలు హాబీగా ఎంచుకుని - అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతోన్న స్ఫూర్తి
స్నేహితులతో కలసి నిరంతర అభ్యాసం చేస్తూ సబ్జెక్ట్‌పై పట్టు పెంచుకున్నాడు రంజిత్. ఆన్‌లైన్‌లోనూ సమాచారం సేకరించుకుని సొంతంగా నోట్స్ తయారుచేసుకునేవాడు. తరచూ కోచింగ్ సెంటర్లలో నిర్వహించే ప్రతిభా పరీక్షలకు హాజరయ్యేవాడు. అలా తన సామర్థ్యాన్ని విశ్లేషించుకునేవాడు. ఏడు నెలల క్రితం రైల్వేశాఖలో టెక్నీషియన్, అనంతరం ఎక్సైజ్ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు దక్కించుకున్నాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్-4 ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికీ ఎంపికయ్యాడు. తాజాగా టౌన్ ప్లానింగ్ అధికారిగా నాలుగో ప్రభుత్వ ఉద్యోగం దక్కడం... ఎనలేని ఆనందాన్ని కలిగిస్తోందని చెబుతున్నాడు.