తెలంగాణ

telangana

ETV Bharat / state

జేఈఈ, నీట్​ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? - మీ కోసమే ఫ్రీ కోచింగ్ - ఎక్కడంటే? - JEE FREE COACHING IN SATHEE PORTAL

నీట్​, జేఈఈ ప్రిపేర్​ అయ్యే విద్యార్థులకు సువర్ణ అవకాశం - అందుబాటులోకి సాథీ పోర్టల్​ - నిపుణులతో సందేహ నివృత్తి

Sathee Portal For NEET JEE Students
Sathee Portal For NEET JEE Students (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 22, 2024, 12:45 PM IST

JEE Free Coaching in Sathee Portal :మీరు జేఈఈ, నీట్​ సహా పలు పోటీ పరీక్షలకు ప్రిపేర్​ అవుతున్నారా? అయితే మీకో గుడ్​ న్యూస్. ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ కాన్పూర్‌తో(ఐఐటీ కాన్పూర్) కలిసి కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ సాథీ (సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌, టెస్ట్‌ అండ్‌ హెల్ప్‌ ఫర్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌) అనే పోర్టల్‌ ద్వారా విశేషమైన సేవలందిస్తోంది.

NEET Free Coaching in Sathee Portal :ఈ పోర్టల్ ద్వారా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే స్టూడెంట్స్​కు ఐఐటీ ప్రొఫెసర్లు/ విషయ నిపుణులతో ఉచితంగా గైడెన్స్​ను అందిస్తున్నారు. జేఈఈ మెయిన్‌-2025కు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థుల కోసం నవంబర్‌ 6 నుంచి 40 రోజుల క్రాష్‌ కోర్సును కూడా ప్రారంభించనుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి.

రిజిస్ట్రేషన్‌ ఇలా

  • ముందుగా సాథీ పోర్టల్‌ను విజిట్​ చేయండి.
  • ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసుకునుంటే సైన్‌ ఇన్‌లోకి వెళ్లి మీ వివరాలను ఎంటర్‌ చేయాలి.
  • ఒకవేళ రిజిస్ట్రేషన్​ చేయకపోయి ఉంటే సైన్‌ అప్‌ అవ్వాల్సి ఉంటుంది.
  • మీ పూర్తి పేరు, ఈ- మెయిల్‌ ఐడీ, సెల్​ఫోన్​ నంబర్​తో పాటు మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
  • జేఈఈ/నీట్‌/ఎస్‌ఎస్‌సీ/బ్యాంకింగ్‌/ఐసీఏఆర్‌/సీయూఈటీ ఇలా మీరు దేనికి సన్నద్ధం కావాలనుకొంటున్నారో ఆ వివరాలను సెలక్ట్​ చేసుకోవాలి.
  • రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక లాగిన్‌ అయ్యి లైవ్‌ సెషన్లు, సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ టూల్స్‌, వీడియో క్లాసులను వినొచ్చు.

ఇక ఈ పోర్టల్​లో జేఈఈ, నీట్‌లకు క్రాష్‌ కోర్సులతో పాటు మాక్‌ టెస్ట్‌లు, ప్రాక్టీస్‌ ప్రశ్నలు, వీడియో క్లాస్​లు, వెబినార్‌లు అందుబాటులో ఉన్నాయి. రిజిస్ట్రేషన్‌, కోర్సులు, ఇతర వివరాల కోసంఈ లింక్‌పైక్లిక్‌ చేయండి. ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో మినహా ప్రతిరోజూ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యార్థులు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో తలెత్తే సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఐఐటీ టాపర్లు, విద్యావేత్తలు, సబ్జెక్టు నిపుణులతో ఈ వేదిక ద్వారా పైసా ఖర్చు లేకుండా కోచింగ్‌ ఇస్తోంది.

జేఈఈ మెయిన్‌ ప్రిపరేషన్‌కు టిప్స్‌ ఇవిగో

  • జేఈఈ మెయిన్‌కు సంబంధించి రికార్డెడ్​ లెక్చర్స్‌ను వారం వారం ఈ పోర్టల్‌ను విజిట్​ చేసి వీక్షించవచ్చు. క్విజ్‌లో పాల్గొని మీరు ఏ మేరకు నేర్చుకున్నారో పరీక్షించుకొనే వీలుంటుంది.
  • ఏఐ ఆధారిత అసెస్‌మెంట్‌లో భాగంగా 60వేలకు పైగా ప్రశ్నలను దీనిద్వారా యాక్సిస్‌ చేసుకోవచ్చు.
  • 100కి పైగా ఆల్‌ ఇండియా మాక్‌ టెస్టులు, టాపిక్‌ల వారీగా టెస్టులు అందుబాటులో ఉంటాయి. అలాగే, ఆన్‌లైన్‌ స్టడీ మెటీరియల్‌, నోట్సు అందుబాటులో ఉంటుంది.

ఇంజినీరింగ్ విద్యార్థులకు అలర్ట్ - ఈ సర్టిఫికెట్ ఉంటే ఇట్టే ఉద్యోగం - Emerging Courses For Students

ఐఐటీ మద్రాసులో రూ.500లకే ఆన్​లైన్ కోర్సులు- అప్లైకు లాస్ట్​ డేట్ ఎప్పుడంటే? - Online AI Courses In IIT Madras

ABOUT THE AUTHOR

...view details