తెలంగాణ

telangana

ETV Bharat / state

వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్​ - ap ex mla Pinnelli arrest - AP EX MLA PINNELLI ARREST

Pinnelli Ramakrishna Reddy Arrest : ఏపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్​ అయ్యారు. హైకోర్టులో 4 ముందస్తు బెయిల్​ పిటిషన్లను హైకోర్టు రద్దు చేసింది. నరసరావుపేటలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ap ex mla Pinnelli arrest
ap ex mla Pinnelli arrest (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 26, 2024, 3:58 PM IST

Updated : Jun 26, 2024, 5:27 PM IST

AP Ex MLA Pinnelli Ramakrishna Reddy Arrest : ఈవీఎం ధ్వంసం, అడ్డుకున్నవారిపై దాడి కేసుల్లో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన ముందస్తు బెయిల్​ పిటిషన్​లను ఏపీ హైకోర్టు కొట్టేయడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. నరసరావుపేటలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఎస్పీ కార్యాలయం నుంచి మాచర్ల కోర్టుకు పోలీసులు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పిన్నెల్లి పిటిషన్​ను కొట్టేసిన హైకోర్టు : అంతకు ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన బెయిల్​ పిటిషన్​లను హైకోర్టు కొట్టేసింది. అరెస్ట్​ నుంచి రక్షణ కోరుతూ 4 ముందస్తు బెయిల్​ పిటిషన్లు పిన్నెల్లి హైకోర్టులో వేశారు. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లిపై పోలీసులు కేసు పెట్టారు. పోలీసుల తరఫున స్పెషల్​ కౌన్సిల్​గా న్యాయవాది ఎన్​. అశ్వినీకుమార్​ వాదించారు. ఫిర్యాదురారు శేషగిరిరావు తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదించారు.

పిన్నెల్లి అరాచకం:ఎన్నికల పోలింగ్‌ రోజు పాల్వయిగేటు పోలింగ్‌ బూత్‌లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయడంతో పాటు అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడారు. దీనిపై ప్రశ్నించిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను దుర్భాషలాడి బెదిరించారు. అలాగే పోలింగ్‌ మరుసటిరోజు పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో విధ్వంసం సృష్టించారు.

సీఐ టీపీ నారాయణస్వామిపై దాడిచేసి గాయపరిచారు. వీటన్నింటి మీదా పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ముందస్తు బెయిల్‌ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన నాలుగు పిటిషన్లు జూన్‌ 20న హైకోర్టులో వాదనలు ముగియగా ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్‌ నిరాకరించిన నేపథ్యంలో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేశారు.

అసలేం జరిగింది : మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు పిన్నెల్లి సోదరులు అనేక అరాచకాలకు, దాడులకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డే స్వయంగా ఈవీఎం ధ్వంసం (EVM Destroyed Case) చేసిన వీడియో సిట్ విచారణలో వెలుగుచూడటం దేశ వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. పోలింగ్‌ అనంతరం కూడా నియోజకవర్గంలో పిన్నెల్లి, ఆయన అనుచరులు టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో తీవ్రంగా స్పందించిన ఎన్నికల కమిషన్‌ పిన్నెల్లి అరెస్టుకు ఆదేశించింది.

దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్‌ వేసి ముందస్తు బెయిల్‌ పొందారు. 6వ తేదీ వరకూ పిన్నెల్లిని అరెస్టు చేయొద్దంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుపై పిన్నెల్లి బాధితుడు నంబూరు శేషగిరిరావు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా హైకోర్టు తీర్పుతో విబేధిస్తూ పిన్నెల్లి కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్లవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ - ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని విజ్ఞప్తి - YS JAGAN LETTER TO ASSEMBLY SPEAKER

ఏపీ మాజీ సీఎం జగన్ 'భద్రతా కథా చిత్రమ్'​ ! - నార్త్​ కొరియా కిమ్​ను తలపించే సెక్యూరిటీ! - AP EX CM Jagan Huge Security

Last Updated : Jun 26, 2024, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details