KTR Ate Biryani with BRS Leaders in Hotel : బిర్యానీ అంటే ఎవరికి నచ్చదు చెప్పిండి. ఎవరైనా కనీసం నెలల్లో ఒక్కసారైనా తినాలని అనుకుంటారు. ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా బిర్యానీకే మొగ్గు చూపుతారు. సరదాగా దోస్తులు కలిసిన బంధువులు ఇంటికి వచ్చినా చికెన్ లేదా బిర్యానీ తింటాం. ఇక బయటకు వెళితే మాత్రం కచ్చితంగా రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ తినాలని అనుకుంటాం. ఈ నేపథ్యంలో బిర్యానీ అంటే మొదట గుర్తొచ్చేది హైదరాబాద్.
ఇక హైదరాబాద్‌లో ఫేమస్ బిర్యానీ రెస్టారెంట్ అంటే ముందుడే వాటిలో ఒకటి ప్యారడైజ్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ కూడా ఈ బిర్యానీకి అభిమానులే. ఇక హైదరాబాదీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఇవాళ ఈ రెస్టారెంట్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు.
ప్యారడైజ్‌లో ప్రత్యక్షమైన కేటీఆర్ : ఇవాళ మాజీమంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సికింద్రాబాద్‌లో ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది ముగిసే సమయానికి లంచ్ టైమ్ అయింది. అప్పుడు ఇంటికి ఎందుకు వెళ్లడం, పక్కనే ప్యారడైజ్ ఉందిగా.. ఓసారి వెళదాం అని నిర్ణయించుకున్నారు. అందరు నేతలకో కలిసి కేటీఆర్ ప్యారడైజ్‌కు వెళ్లారు. కేటీఆర్‌ను చూడగానే రెస్టారెంట్‌కు వచ్చిన కస్టమర్స్ ఆయనతో ఫోటీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. కేటీఆర్ కూడా సెల్ఫీలు దిగి వారితో కాసేపు ముచ్చటించారు. హోటల్ సిబ్బంది కూడా కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. దీంతో కాసేపు రెస్టారెంట్లో సందడి వాతావరణం నెలకొంది.
అనంతరం పార్టీ నేతలతో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ కేటీఆర్ బిర్యానీ తిన్నారు. చివర్లో బిర్యానీ సూపర్ అంటూ ప్యారడైజ్ మేనేజ్మెంట్ను మెచ్చుకున్నారు. అక్కడున్న వారు కేటీఆర్‌ను చూసి వాట్ ఏ సింప్లిసిటీ అంటూ కొనియాడారు. ఇటీవలే నాంపల్లిలోని ఓ టీ స్టాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ టీ తాగారు. అక్కడున్న వారు సైతం కేటీఆర్‌ను చూసి ఒకింత షాక్‌కు గురై ఫొటోలు తీసుకున్నారు.
సత్య నాదెళ్లతో మంత్రి కేటీఆర్ బిర్యానీ ముచ్చట్లు