తెలంగాణ

telangana

ETV Bharat / state

'నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే తప్పుడు కేసులు' - హైకోర్టులో హరీశ్‌రావు క్వాష్‌ పిటిషన్‌

హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన మాజీమంత్రి హరీశ్‌రావు - పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలని పిటిషన్

HARISH RAO PETITION IN HIGH COURT
Harish Rao Filed Quash Petition in HC (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 16 hours ago

Harish Rao Filed Quash Petition in HC :పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలంటూ హరీశ్​రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతో చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఈ కేసులో పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా, అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్‌ పంజాగుట్టలోని నాగార్జున సర్కిల్‌లో కార్యాలయం తీసుకొన్నారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఈ నెల 1వ తేదీన పోలీసులు 120(బి), 386, 409,506 సెక్షన్ల కింద, అలాగే రెడ్​విత్​​ 34, ఐటీ యాక్ట్​ కింద కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని హరీశ్​రావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా రాజకీయంగా కీలకంగా వ్యవహరించడంతోపాటు 2014 నుంచి 2023 వరకు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారని పిటిషనర్ తరఫు న్యాయవాది పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజకీయ కక్ష్యల కారణంగానే హరీశ్​రావుపై ఫిర్యాదు చేశారని, పోలీసులు కూడా తగిన సాక్ష్యాధారాలు సేకరించకుండానే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా, అరెస్ట్ చేయకుండా స్టే విధించాలని మధ్యంతర అప్లికేషన్‌లో కోరారు.

వేధించి బెదిరించారని హరీశ్‌రావుపై ఫిర్యాదు : 2021 మార్చిలో పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లో ఫార్మర్స్‌ ఫస్ట్‌ ఫౌండేషన్​ను ఏర్పాటు చేశానని హరీశ్​రావుపై ఫిర్యాదు చేసిన గదగోని చక్రధర్​గౌడ్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపునకు మళ్లించే దిశగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఏర్పాటు చేశానని తెలిపారు. గతేడాది కూడా రైతు కుటుంబాలకు చెందిన 150 మంది వితంతులకు రూ.లక్ష చొప్పున నగదును పంపిణీ చేశానని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేతో సహా ఏ ఇతర నేతలను ఆహ్వానించలేదని చెప్పారు.

ఇలాంటి సేవా కార్యక్రమాలతో తనకు మంచి పేరు వస్తుందనే స్థానిక ఎమ్మెల్యే అప్పటి మంత్రి అయిన హరీశ్​రావు తనపై కక్ష పెంచుకున్నారని గదగోని చక్రధర్​గౌడ్‌ వెల్లడించారు. అప్పటి నుంచి హరీశ్​రావు, అయన అనుచరుల నుంచి బెదిరింపులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు ఆపకపోతే చంపేస్తామని బెదిరించారని వివరించారు. ఎన్నికల సమయంలో తనతోపాటు తన కుటుంబసభ్యులు, మిత్రుల కదలికలపై కూడా నిఘా ఉంచారని, తమ ఫోన్లను సైతం ట్యాపింగ్​ చేశారని ఫిర్యాదులో వివరించారు.

'అక్రమ కేసులు పెట్టించి వేధించారు' : హరీశ్​రావుపై పంజాగుట్ట పీఎస్​లో కేసు

ABOUT THE AUTHOR

...view details