KTR about Handloom Workers Compensation : సిరిసిల్ల చేనేత కార్మికుల కుటుంబాలు పరిహారం కోసం ఇంకెంత కాలం ఎదురు చూడాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా, 18 మంది ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కార్మికులకు పరిహారం చెల్లించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
ప్రభుత్వం నియమించిన కమిటీ నిష్క్రియంగా ఉండటంతో ఇంకా ఎన్ని చేనేత కుటుంబాలు మౌనంగా బాధపడాలని కేటీఆర్ నిలదీశారు. ఇప్పటి వరకు ఆ కమిటీ నివేదికను సమర్పించలేదని ధ్వజమెత్తారు. బతుకమ్మ, ఇతర పండుగల కానుకల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో చేనేత కుటుంబాలు నిరాశకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
'కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా, 18 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యకు పాల్పడినా, సిరిసిల్ల చేనేత కార్మికుల కుటుంబాలు పరిహారంపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బతుకమ్మ, ఇతర పండుగల కానుకల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో చేనేత కుటుంబాలు నిరాశకు గురయ్యాయి'- కేటీఆర్ ట్వీట్
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోంది : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తాజాగా వెల్లడించిన ర్యాంకింగ్‌లో తెలంగాణలో రేవంత్ ప్రభుత్వ దుష్పరిపాలనకు అద్దం పడుతుందని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఈఓడీబీ ర్యాంకింగ్స్‌లో నిలకడగా అగ్ర స్థానంలో నిలిచిందన్నారు. ఇప్పుడు ఈఓడీబీ సంస్కర్తల ర్యాంకింగ్స్‌లో తెలంగాణ రాష్ట్రాన్నికి చోటు దక్కించుకోకపోవడం దురదృష్టకరమైనదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ర్యాంకింగ్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర పనితీరు ఇప్పుడు చెత్తగా ఉందని ఎక్స్ వేదికగా ఆరోపించారు. అతని పరిపాలనలో నీడలేని వెంచర్లు, షెల్ కంపెనీలు అభివృద్ధి చెందుతుండగా, తెలంగాణ ప్రతిష్ఠ వ్యాపార వాతావరణం కూలిపోతుందన్నారు. ఈ పతనాన్ని వివరించడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందా? రేవంత్ లాంటి ముఖ్యమంత్రి అసమర్థత వల్ల తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ఎలా దెబ్బతింటోందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు.
ప్రజాపాలన అంటే ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కటమేనా? : కొణతం దిలీప్ అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్ - Konatham Dileep Arrested
'రూ.5 లక్షలు కాదు రూ. 25 లక్షలు ఇవ్వాలి' - వరద బాధితుల నష్టపరిహారంపై కేటీఆర్ ట్వీట్ - KTR Tweet Latest