Former CM KCR Bus Yatra and Road Shows New Schedule : బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ 48 గంటలపాటు నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఈసీ విధించిన గడువు మూడో తేదీ సాయంత్రం 8 గంటలకు ముగుస్తుంది. ఈ క్రమంలో అదే రోజు సాయంత్రం 8 గంటల తర్వాత నుంచి కేసీఆర్ బస్సు యాత్రలు, రోడ్డు షోల షెడ్యూల్‌లు గతంలో ప్రకటించిన విధంగానే యథావిధిగా కొనసాగనున్నాయి. కేసీఆర్ బస్సుయాత్రలు, రోడ్డు షోల వివరాలను పార్టీ విడుదల చేసింది.
కేసీఆర్ బస్సుయాత్ర- రోడ్డు షో వివరాలు :
- 03.05.2024న సాయంత్రం 8 గంటల తర్వాత రామగుండంలో రోడ్ షో
- 04.05.24న సాయంత్రం మంచిర్యాలలో రోడ్ షో
- 05.05.24న సాయంత్రం జగిత్యాలలో రోడ్ షో
- 06.05.24న సాయంత్రం నిజామాబాద్ రోడ్ షో
- 07.05.24న కామారెడ్డిలో రోడ్ షో, అనంతరం మెదక్‌లో మరో రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
- 08.05.24న నర్సాపూర్‌లో రోడ్ షో, అనంతరం పటాన్‌చెరులో రోడ్ షో నిర్వహణ
- 09.05.24న కేసీఆర్ బస్సు యాత్ర కరీంనగర్‌కు చేరుకుంటుంది. అదే రోజు సాయంత్రం కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ అధినేత రోడ్ షో నిర్వహించనున్నారు.
- 10.05.24న (ఆఖరి రోజు) సిరిసిల్లలో రోడ్ షో అనంతరం సిద్దిపేటలో బహిరంగ సభ నిర్వహిస్తారు. దీంతో కేసీఆర్ బస్సు యాత్ర ముగుస్తుంది.
అసలేం జరిగింది :ఏప్రిల్ 5న సిరిసిల్లలో కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరంజన్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. అందుకు కేసీఆర్‌ను ఈసీ వివరణ కోరింది. అందుకు ఆయన తన మాటలను అధికారులు సరిగా అర్థం చేసుకోలేదని, స్థానిక మాండలికాన్ని అధికారులు అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగిందని తెలిపారు. అయితే కాంగ్రెస్ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకొని వాటిపైనే ఫిర్యాదు చేశారని వివరణ ఇచ్చారు.