Food Provided at Anganwadi Centres to Malnourished Children :పోషకాహార లోపం పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వారి ఎదుగుదలకో శాపంగా మారుతోంది. చాలా మంది చిన్నారులు రక్తహీనతతో బాధ పడుతున్నారు. కొందరు తల్లిదండ్రులు బాల్య వివాహాలు చేయడంతో బలహీన, తక్కువ బరువు, వయసుకు తగ్గ ఎత్తు పెరగని పిల్లలు పుడుతున్నారు. మొదట తల్లికే సరైన పోషకాహారం అందక బలహీనంగా ఉండటం కారణంగా పుట్టే పిల్లలు సైతం తక్కువ బరువుతో జన్మిస్తున్నారు.
పిల్లలు బలహీనంగా ఉంటే :అంగన్‌వాడీ కేంద్రాల్లో రోజూ చిన్నారులకు ఒక పూజ భోజనం పెడుతున్నారు. నెలకు 16 గుడ్లు, బలహీనంగా ఉన్న చిన్నారులకు బాలామృతం పంపిణీ చేస్తున్నారు. వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేకున్నా పౌష్టికాహార లోపం ఉన్నట్లు గుర్తించి వారికి ప్రత్యేకంగా బాలామృతం ప్లస్‌తో పాటు భోజనంలో 5 గ్రాముల నెయ్యి, 100 గ్రాముల పాలు అందిస్తున్నారు. ప్రతివారం వారి కొలతలు పరిశీలిస్తారు. వారి చిత్రాలు తీసి ఆర్నెళ్ల తర్వాత పాత చిత్రంతో పోల్చి మార్పులు చూస్తారు.
ఎంత తినిపించినా మీ పిల్లలు బక్కగానే ఉంటున్నారా? - ఇక్కడ చేర్పిస్తే బాల భీములవుతారు!
జాగ్రత్తలు ఇలా :చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాలకు ఉదయం 9 గంటలకు వస్తారు. అప్పటికే వారు ఏదో ఒకటి తిని వస్తారు కాబట్టి రెండు గంటల తర్వాత (11 గంటలు) ఆకలి పరీక్ష చేసి 200 గ్రాముల భోజనం 45 నిమిషాల్లో తినేలా పరీక్షిస్తారు. ఆ సమయంలోపు తినకుంటే జనరల్ ఆస్పత్రిలోని న్యూట్రీషియన్ రిహాబిటేషన్ కేంద్రానికి తీసుకెళ్లి అనారోగ్య సమస్యలు ఉన్నాయా? ఆహారం ఎందుకు తీసుకోవడం లేదని వైద్యుల పర్యవేక్షణలో గుర్తిస్తారు. అటువంటి చిన్నారులను 15 రోజుల పాటు వైద్యుల సలహాతో కేంద్రంలో ఉంచి పౌష్టికాహారం అందిస్తారు.