తెలంగాణ

telangana

ETV Bharat / state

సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం - పరిశ్రమ డైరెక్టర్ సహా ఐదుగురి మృతి - Fire Accident in Sangareddy - FIRE ACCIDENT IN SANGAREDDY

Fire Accident in Sangareddy Chemical Factory : సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హత్నూర మండలం చందాపూర్‌ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పరిశ్రమ డైరెక్టర్‌ రవితో పాటు మరో నలుగురు కార్మికులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Fire Accident in Sangareddy District
Fire Accident in Sangareddy Chemical Factory

By ETV Bharat Telangana Team

Published : Apr 3, 2024, 6:55 PM IST

Updated : Apr 3, 2024, 10:40 PM IST

సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం - పరిశ్రమ డైరెక్టర్ సహా ఐదుగురి మృతి

Fire Accident in Sangareddy Chemical Factory :సంగారెడ్డి జిల్లాలో వరుస అగ్నిప్రమాదాలు సామాన్యుల ప్రాణాలను బలిగొంటున్నాయి. హత్నూర మండలంలోని ఓ కెమికల్​ పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. చందాపూర్‌ శివారులోని ఎస్​బీ ఆర్గానిక్‌ పరిశ్రమలో ఆయిల్‌ బాయిలర్‌ పేలడంతో(Boiler Explosion) ఒక్కసారిగి మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి బిల్డింగ్స్​ ధ్వంసమయ్యాయి.

ఈ ప్రమాదంలో పరిశ్రమ డైరెక్టర్‌తో పాటు బిహార్‌కు చెందిన మరో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. అలానే పది మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని సంగారెడ్డి, హైదరాబాద్‌ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫైర్​ యాక్సిడెంట్​ జరిగిన వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

టైలర్​ షాప్​లో ఘోర అగ్ని ప్రమాదం- ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి - Maharashtra Fire Accident

సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్‌ నేతృత్వంలో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 60 మంది ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఇందులో దాదాపు 15 మంది పేలుడు సంభవించిన రియాక్టర్​ వద్దే పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రమాద స్థలిని మంత్రి కొండా సురేఖ, పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్‌ రెడ్డి, నర్సాపూర్‌ శాసనసభ్యురాలు సునితా రెడ్డి, మెదక్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు పరిశీలించారు.

పేలుడు ఘటనపై సీఎం రేవంత్​రెడ్డి దిగ్భ్రాంతి : ఎస్​బీ పరిశ్రమ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సహాయక చర్యలపై సమీక్షించిన సీఎం, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పేలుడు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని ప్రభుత్వానికి ఆదేశించారు.

BRS Leaders Response on Fire Accident :సంగారెడ్డి పరిశ్రమలో రియాక్టర్ పేలి కార్మికులు మృతి చెందిన ఘటనపై బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​, ఆ పార్టీ మాజీ మంత్రి హరీశ్​రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

Minister Damodara Raja Narasimha visited to injured Persons :పరిశ్రమ వద్ద జరిగిన పేలుడు ఘటనను రాష్ట్ర వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలించారు. అనంతరం సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్‌ ఆసుపత్రుకు వెళ్లి చికిత్సపొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు.

నైట్‌క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం- 29 మంది మృతి - turkey fire accident today

వేసవిలో అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం : డీఎఫ్​వో - FIRE OFFICER SRINIVAS INTERVIEW

Last Updated : Apr 3, 2024, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details