Fight Between Two Priests In AP :ఆంధ్రప్రదేశ్తిరుపతి జిల్లా తలకోన శివాలయంలో ఇద్దరు అర్చకుల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. భక్తులంతా చూస్తుండగానే అర్చకులు శివప్రసన్న శర్మ, ప్రసాద్ శర్మ ఒకరినొకరు దాడి చేసుకున్నారు. శివన్న ప్రసన్నశర్మ కుమారుడు మనోజ్‌కు సహాయ అర్చక పోస్టు విషయంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తనను తెలియకుండా తన సంతకాన్ని శివ ప్రసన్నశర్మ ఫోర్జరీ చేశారని ప్రసాద్ శర్మ ఆరోపించారు. దీనిపై జరిగిన వాగ్వాదం పెద్దదై ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది.
శివ శివా, ఇదెక్కడి అరాచకం - ఆలయంలోనే అర్చకుల మధ్య ఫైటింగ్ - FIGHT BETWEEN TWO PRIESTS
తిరుపతి జిల్లా తలకోన శివాలయంలో ఇద్దరు అర్చకుల మధ్య వివాదం - పరస్పరం దాడిచేసుకున్న అర్చకులు - శివప్రసన్నశర్మ కుమారుడు మనోజ్‌కు సహాయ అర్చక పోస్టు విషయంలో వివాదం
Published : Nov 12, 2024, 3:19 PM IST
శివప్రసన్న శర్మ తన కుమారుడిని సహాయ అర్చకునిగా నియమించే ప్రతిపాదనలకు సంబంధించి ప్రసాద్ శర్మతో ప్రస్తావించకపోవడమూ ఈ వివాదానికి కారణం అయ్యింది. అలానే నియామక ప్రతిపాదన పత్రాలపై తనతో సంప్రదించకుండా శివప్రసన్న శర్మ తన సంతకం చేశారని ప్రసాద్ శర్మ ఆరోపించడంతో ఇద్దరిమధ్య గొడవకు దారి తీసింది. ఇటీవల శివప్రసన్న శర్మ తనయుడు మనోజ్‌ను తలకోన టెంపుల్లో సహాయక అర్చకుడిగా నియమించారు. ఈ నేపథ్యంలో అర్చకుల మధ్య వివాదం రాజుకుంది. అర్చకులు ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్న దృశ్యాలు ఆలయ సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి.