A Father Killed His Son in Medak District :ప్రస్తుత రోజుల్లో సెల్‌ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో కనిపిస్తుంది. పిల్లల నుంచి పెద్ద వారి వరకు మొబైల్ ఫోన్లను వాడుతున్నారు. ఓవైపు సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్ అంటూ, అర్ధరాత్రి దాటినా మెలకువగా ఉంటూ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. మరోవైపు కొందరు ఆన్‌లైన్ గేమ్స్ కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఒకప్పుడు ఎక్కడో గుట్టుగా సాగిపోయే ఈ బెట్టింగ్ వ్యవహారం, ఇప్పుడు పలు యూట్యూబ్ ఛానళ్లు, వెబ్‌సైట్ల ద్వారానే కాకుండా మొబైల్ యాప్‌ల రూపంలోనూ అమాయకుల జేబులను కొల్లగొడుతున్నాయి. ఆన్‌లైన్‌లో తారస పడుతున్న ప్రకటనలు క్షణాల వ్యవధిలో ఖాతాలు ఖాళీ చేస్తున్నాయి.
Online Betting Addiction Deaths :బాధితులు ఆట మోజులో పడి సర్వం కోల్పోతున్నారు. దీంతో బాధిత కుటుంబాలను ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నష్టపోయిన మరికొందరు ఆత్మహత్యలు చేసుకొని జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. మరికొన్ని సంఘటనల్లో తల్లిదండ్రులు బెట్టింగ్‌కు అలవాటు పడిన పిల్లలను మందలిస్తున్నారు. ఈ క్రమంలో ఎంత చెప్పినా వినకపోవడంతో క్షణికావేశంలో వారి ప్రాణాలు కూడా తీస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
రోజురోజుకీ పెరుగుతున్న ఈ తరహా మోసాలు కలవర పెడుతున్నాయి. తాజాగా బెట్టింగ్‌లకు అలవాటు పడిన కుమారుడిని తండ్రి కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లికి చెందిన ముకేశ్‌కుమార్ రైల్వే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతను సరదాగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇలా రూ.2 కోట్ల వరకు డబ్బులు పొగొట్టుకున్నాడు.