Vegetables Prices In Rythu Bazar : తెలంగాణలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొనుగోళ్లు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రతిరోజూ 40 శాతం మేరకు కూరగాయల నిల్వలు మిగిలిపోతున్నాయి. ఎక్కువ అధికశాతం కుళ్లిపోతుండటంతో వ్యాపారులుకు కూరగాయలను పారబోస్తున్నారు. రోజుకు రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. గత రెండు నెలలుగా రాష్ట్రంలో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. టమాటా, చిక్కుడు లాంటి కూరగాయల ధరలు కిలో రూ.వంద దాటాయి. బీన్స్, పచ్చిమిర్చి రూ.150 వరకు చేరాయి. బెండ, వంకాయ, దొండ తదితర కూరగాయల ధరలు.50 దాటిపోయాయి.
తెలంగాణలో కూరగాయల సాగు ఆలస్యం అయ్యింది. దీంతో అధిక శాతం సరుకు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అందువల్ల రవాణా ఛార్జీలు, గుత్తేదారుల లాభాలు వంటివాటిని పరిగణనలోనికి తీసుకొని ధరలపై ప్రభావం పడుతుంది. చిరువ్యాపారులు వీటిని కొని విక్రయిస్తున్నారు. కూరగాయలు పండించే రైతులు కూడా అదే ధరలకు అమ్మకాలు జరుపుతున్నారు. తాను రైతుబజార్‌కు బీరకాయలు తెచ్చానని, స్థానికంగా ఉన్న ధర చెబితే వినియోగదారుల కొనడం లేదంటూ రైతు వాపోతున్నారు.
ధర తగ్గించి అమ్మాలంటే వ్యాపారులు ఒప్పుకోవడం లేదని రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు అనే శ్రీనివాస్ తన గోడువెల్లబోసుకున్నారు.ధరలు పెరిగినప్పటి నుంచి కొనుగోళ్లు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపారు. తెచ్చిన కూరగాయలు తెచ్చినట్లే ఉండిపోతున్నాయని హైదరాబాద్ మోండా మార్కెట్ కు చెందిన ఓ చిరువ్యాపారి వెల్లడించారు. సాధారణ డిమాండును దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం కూరగాయలు దిగుమతి అవుతున్నాయని తెలిపారు. కానీ అధిక ధరల వల్ల అమ్మకాలు తగ్గేసరికి నష్టపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు.
ఆ కూరగాయలను పచ్చిగా తింటున్నారా? ఆరోగ్యం డేంజర్లో పడ్డట్టే! - Eating Raw Vegetables