ETV Bharat / entertainment

పెళ్లి విషయంలో అటువంటి నిర్ణయం తీసుకున్న చైతూ, శోభిత! - ఆ కోలీవుడ్ జంట దారిలోనే! - NAGA CHAITANYA SOBHITA WEDDING

వేగంగా జరుగుతున్న నాగ చైతన్య - శోభిత పెళ్లి పనులు - పెళ్లి విషయంలో ఇరు కుటుంబాలు తీసుకున్న ఆ నిర్ణయం ఏంటంటే?

Naga Chaitanya Sobhita Wedding
Naga Chaitanya Sobhita (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2024, 7:05 PM IST

Naga Chaitanya Sobhita Wedding : టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య త్వరలో ఒక ఇంటివాడు అవ్వనున్నారు. నటి శోభితతో ఆయన ఏడడుగులు వేయనున్నారు. ఇప్పటికే వీరి పెళ్లి పనులు స్టార్టై చక చక జరుగుతోంది. అయితే పెళ్లికి సంబంధించిన ఓ విషయంలో ఈ జంట కోలీవుడ్ హీరోయిన్ నయనతారను ఫాలో అవుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అదేంటంటే?

సింపుల్ వెడ్డింగ్ - అతిథులు ఎంతమంది అంటే?
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఈ జంట పెళ్లి చేసుకోనుంది. దాదాపు 300 మంది అతిథుల సమక్షంలో చాలా సింపుల్‌గా ఈ వివాహ వేడుక జరగాలని ఇరు కుటుంబాలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమ పెళ్లిని ఓ స్పెషల్ డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకులకు అందించాలంటూ చై-శోభిత భావించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయట. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఓటీటీ సంస్థలు దీని స్ట్రీమింగ్‌ రైట్స్‌ సొంతం చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.

ఆ డాక్యుమెంటరీలో ఏం చూపించనున్నారంటే?
ఇక ఆ డాక్యుమెంటరీలో నాగచైతన్య కెరీర్‌, అలాగే వ్యక్తిగత జీవితంలో తనకు ఎదురైన ఇబ్బందులు ఇక శోభితతో పరిచయం, వారిద్దరి ప్రేమ, పెళ్లి గురించి అందులో చూపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడీ విషయం వైరల్‌ కావడం వల్ల పలువురు నెటిజన్లు వీరు కూడా నయనతార బాటలోనే అడుగులు వేస్తున్నారని అనుకుంటున్నారు. ఇటీవలే నయన్​ దంపతులు కూడా తమ పెళ్లి వీడియోను ఓ డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. 'నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌'గా నెట్​ఫ్లిక్స్​లోకి వచ్చిన ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ నవంబర్‌ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

పెళ్లి వేదిక అదే ఎందుకంటే?
అయితే అన్నపూర్ణ స్టూడియోలోని తన తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం వద్దనే తమ పెళ్లి జరగనుందంటూ నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. "మా పెళ్లి వేడుకల్లో ఎలాంటి ఆర్భాటాలకు తావులేదు. తాతగారి విగ్రహం ఎదురుగానే మా వివాహం జరగనుంది. ఆయన ఆశీస్సులు మాపై సదా ఉండాలనే ఉద్దేశంతోనే ఇరు కుటుంబాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. శోభితతో ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు నేను ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను. తను నన్ను ఎంతో బాగా అర్థం చేసుకుంది. నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని ఆమె పూడుస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా" అని చైతూ అన్నారు.

వేదిక ఫిక్స్! - చైతూ, శోభిత పెళ్లి ఎప్పుడంటే?

జంగిల్ సఫారీ టు లండన్ గేట్ వే - శోభితతో చై ప్రేమ చిగురించిందిలా! - Naga Chaitanya Sobhita Love Story

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.