తెలంగాణ

telangana

ETV Bharat / state

అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు - EWS ధ్రువీకరణ పొందండిలా! - EWS CERTIFICATE APPLICATION

అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు - ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణ పత్రం కోసం మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తులు

EWS certificate
EWS certificate Application In Meeseva (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2025, 3:01 PM IST

EWS certificate Application In Meeseva: అగ్రవర్ణాల పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. ఈ రిజర్వేషన్‌ పొందడానికి వారు ఈడబ్ల్యూఎస్‌ (ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌) ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. తెలంగాణలో కళాశాలల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ముందుగానే ఈ ధ్రువపత్రం తీసుకుంటే ప్రవేశాలకు సులువుగా ఉంటుంది. దీంతో అనుకున్న సమయంలో కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు.

మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు : ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణ పత్రం కోసం సమీప మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థి ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో, రేషన్‌ కార్డు, ఐటీ పత్రాలు, అఫిడవిట్‌ జతచేసి రూ.45 చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను సంబంధిత ఆర్‌ఐ, తహసీల్దార్లు విచారించి ఇస్తారు. అర్హులని తేలితే ఈడబ్ల్యూఎస్‌ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. ఈ పత్రం జారీ చేసినప్పటి నుంచి సంవత్సరం వరకే చెల్లుబాటవుతుంది.

అర్హులు ఎవరంటే

  • కుటుంబ సభ్యుల మొత్తం ఆదాయం అంటే తల్లిదండ్రులతో పాటు ఆ ఇంటిలో 18 ఏళ్లకు పైబడిన వారి ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలలోపు ఉండాలి.
  • 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉండాలి.
  • నివాసం ఉండే ఇల్లు వెయ్యి చదరపు అడుగుల కంటే తక్కువ ఉండాలి.
  • మున్సిపాలిటీలు/ కార్పొరేషన్‌లలో ఇంటి స్థలం ఉంటే అది 100 గజాల కంటే తక్కువ ఉండాలి. అదే ఇంటి స్థలం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే 200 గజాల కంటే తక్కువ ఉండాలి.

మీకు రిజర్వేషన్ కావాలంటే ఆ సర్టిఫికెట్ సమర్పించాల్సిందే - హైకోర్టు

లాయర్​గా అదరగొట్టిన ఇంటర్ విద్యార్థి- EWS కోటా​ కోసం హైకోర్టులో వాదనలు- జడ్జి ఇంప్రెస్!

ABOUT THE AUTHOR

...view details