Epilepsy Center Started in AIG Hospitals : ఎపిలెప్సీ (మూర్ఛ వ్యాధి) అంటే ఆందోళన చెందకూడదని, మందులు, శస్త్ర చికిత్సతో తగ్గించవచ్చని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర రెడ్డి తెలిపారు. ఆదివారం జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం సందర్భంగా ఏఐజీలో మూర్ఛ వ్యాధి రోగులకు అత్యాధునిక వసతులతో ప్రత్యేక కేంద్రాన్ని (ఏఐజీ సెంటర్ ఫర్ ఎపిలెప్సీ) ప్రారంభించారు. కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ) కార్యక్రమాన్నీ చేపట్టారు. నాగేశ్వర రెడ్డి కార్యక్రంలో వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు.
మూర్చతో బాధపడుతున్నారా? ఆందోళన చెందకండి - మందులు, శస్త్ర చికిత్సతో తగ్గించొచ్చట
హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో ఎపిలెప్సీ సెంటర్ ప్రారంభం - ఆదివారం జాతీయ మూర్ఛ దినోత్సవం సందర్భంగా మొదలు
Published : 4 hours ago
ఈ కేంద్రం ద్వారా మూర్ఛ రుగ్మతకు ప్రపంచ స్థాయి చికిత్సను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు. హాస్పిటల్ న్యూరాలజీ విభాగం అధిపతి డాక్టర్ ఎస్ఐ జబీన్, ఆసుపత్రి న్యూరోసర్జన్ సుబోధ్‌రాజు తదితరులు కార్యక్రమంలో మాట్లాడారు. ప్రారంభోత్సవానికి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ, బెంగళూరు ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్ డా. భాస్కర్ రావు, చెన్నై గ్లోబల్ ఆసుపత్రి డాక్టర్ దినేష్ నాయక్, ఎయిమ్స్ (దిల్లీ) వైద్యుడు రమేశ్ దొడ్డమణి, ఏఐజీ హాస్పిటల్ వైస్‌ఛైర్మన్ వీపీఎస్ రాజు, డైరెక్టర్ డాక్టర్ జీవీ రావు, డా. రఘు, డా.ఎంకే మూర్తి తదితరులు పాల్గొన్నారు.