Elephant Moved from Asifabad District to Maharashtra :ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి దారితప్పి వచ్చిన గజరాజు కుమురం భీం జిల్లాలోని పెంచికల్‌పేట్, చింతనమానేపల్లికి చెందిన ఇద్దరు రైతులను హతమార్చిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు హడలెత్తించిన ఏనుగు, శుక్రవారం సాయంత్రం ప్రాణహిత నది దాటి మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్లిపోయింది. పెంచికల్‌పేట్ మండలం మొర్లిగూడ, జిల్లెడగుట్ట అటవీ ప్రాంతంలో మధ్యాహ్నం వరకు సేదతీరిన ఏనుగు, సాయంత్రం 6 గంటల తర్వాత జిల్లెడ మార్గం గుండా ప్రాణహిత దాటి మహారాష్ట్ర ప్రాంతంలోని చిన్నవట్ర గ్రామం వైపు వెళ్లినట్లు డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించినట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు.
ఏనుగు దాడిలో ఇద్దరు అన్నదాతల మృతి - ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధింపు - Two Farmers Died in Elephant Attack
Elephant Attack in Komaram Bheem Updates :గజరాజు జిల్లా నుంచి తరలివెళ్లడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం ఉదయం ఏనుగు పెంచికల్‌పేట్ మండలం కమ్మర్గాం పల్లె ప్రకృతి వనానికి వచ్చి అడవిలోకి వెళ్తుండగా, పలువురు యువకులు గమనించారు. మరికొద్ది సేపటికి మురళిగూడ వెళ్లే దారిలో ముసలమ్మ గుట్ట వద్ద ఒక ఆటోకు ఎదురైంది. ఏనుగు ఆచూకీ కోసం అధికారులు 30 మంది ట్రాకర్స్‌ను ఏర్పాటు చేసి అడవిని జల్లెడ పట్టారు. రెండు డ్రోన్, ఒక థర్మల్ డ్రోన్ కెమెరాల ద్వారా అన్వేషణ సాగించారు.
ఏనుగు భయం కారణంగా ఉపాధి హామీ పనులు నిలిపివేత:మురళిగూడ నందిగాం అటవీ ప్రాంతంలో ఏనుగు సంచరిస్తున్నట్లు డ్రోన్ ద్వారా గుర్తించారు. అధికారులు అటవీ ప్రాంతంలోనే ఉండి దాని కదలికలపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. వీరితో పాటు గడ్చిరోలి డివిజన్ నుంచి వచ్చిన అధికారుల బృందం కూడా దాని కదలికలపై దృష్టి పెట్టింది. దారి తప్పి వచ్చిన గజరాజును ప్రాణహితను దాటించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో పాటు అటవీ పోలీసు శాఖ అధికారులు గ్రామాలకు వెళ్లి ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పించారు. బెజ్జూరు, పెంచికలపేట్, దహెగాం, చింతలమానేపల్లి మండలాల్లోని ప్రజలు ఏనుగు భయం కారణంగా ఉపాధి హామీ పనులు నిలిపివేశారు. సలగుపల్లి, పెంచికల్‌పేట, కడంబా మార్గాల్లో ప్రయాణికుల రాకపోకలు కొనసాగించేందుకు భయాందోళనలకు గురువుతున్నారు.
మహారాష్ట్రకు వెళ్లిపోయిన ఏనుగు :ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్రలో గుంపులో ఉండి తర్వాత విడిపోయి ఒంటరిగా ప్రాణహిత దాటి తెలంగాణకు వచ్చిన మగ ఏనుగు, ఈ ప్రాంతంలో ఒంటరిగా ఉండటం, ఆహారం దొరకకపోవడం వల్ల క్రూరంగా ప్రవర్తిస్తూ ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఏనుగు మొర్లిగూడ, జిల్లెడ గుట్ట సమీపంలోని ప్రాణహిత వద్ద కనిపించడంతో నది దాటి వెళ్లిపోతుందని అధికారులంతా భావించగా, ఏనుగు అదే మార్గంలో మహారాష్ట్ర అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది.
ఏనుగు దాడిలో రైతు కూలీ మృతి - భయాందోళనలో స్థానిక గ్రామాల ప్రజలు - Farmer Died in Elephant Attack
రైతు కూలీలపై ఏనుగు దాడి- త్రుటిలో తప్పించుకొన్న వ్యక్తి- లైవ్ వీడియో