DRI Seized Rs 7 Crore Drugs At Shamshabad :శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 7.10 కిలోల హైడ్రోఫోలిక్ వీడ్‌ను అధికారులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారిద్దరిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివారాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల కట్టడికి పోలీసులు ఎన్ని కఠినమైన చర్యలు తీసుకున్నప్పటికీ మత్తు పదార్థాల సరఫరాదారుల ముఠా ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. రోజుకో కొత్త మార్గం ద్వారా రాష్ట్రానికి డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. కొద్ది నెలల వ్యవధిలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వడంతో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టమైన అదేశాలు జారీ చేశారు.