Drug Sized in Hyderabad : హైదరాబాద్‌లో ఏకంగా రూ.8 కోట్ల విలువైన మత్తు పదార్థాలు పట్టుబడటం, అనేక రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్న నైజీరియా డ్రగ్ కింగ్ పిన్ స్టాన్లీని తెలంగాణ టీన్యాబ్ పోలీసులు పట్టుకోవడం సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు నగరంలో దొరకడం ఇదే తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 500 పైచిలుకు మత్తు పదార్థాల కొనుగోలుదారులు విక్రయదారులతో స్టాన్లీకి సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. దీంతో ఎవరెవరు ఇతని వద్ద మాదక ద్రవ్యాలు(Drugs) కొనుగోలు చేశారనే అంశంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
98 లక్షలు కొల్లగొట్టి, క్షణాల్లోనే 11 ఖాతాలకు బదిలీ - పోలీసుల చాకచక్యంతో 85 లక్షలు సేఫ్
Rs.8 Crore Worth Drug Sized in Hyderabad : మాదక ద్రవ్యాలు స్టాన్లీ వద్ద కొనుగోలు చేసి వాడిన వారిలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వివరాలు కూడా రాబడుతున్నారు. ఎర్రమంజిల్ వద్ద పిన్ స్టాన్లీని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద అర కిలోకు పైగా కొకైన్‌తో పాటు హెరాయిన్ తదితర మత్తు పదార్థాలు, అమెరికాలో సాగయ్యే గంజాయి ఓషన్ గ్రీన్ కిన్నావిస్ 45 గ్రాములు లభించింది. ఇది ఒక గ్రాముకు రూ.5000 వరకు ధర ఉంటుందని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ సరఫరాదారు స్టాన్లీ స్వసలం నైజీరియాలోని అనంబ్ర రాష్ట్రం. 2009లో బిజినెస్ వీసాపై ముంబయి చేరాడు.
Telangana Teenab Police Caught Ganja : అంధేరి ప్రాంతంలో మిత్రుడు జెవెల్తో కలిసి రెడీమేడ్ వస్త్ర వ్యాపారం ప్రారంభించాడు. ఏడాది తరువాత గోవా, కండోలిమ్ ప్రాంతాలకు మకాం మార్చి అక్కడా వస్త్ర వ్యాపారం నిర్వహించాడు. క్రమంగా గోవా పరిసర ప్రాంతాల్లోని నైజీరియన్లతో స్నేహం ఏర్పడింది. వారితో కలిసి మద్యం, కొకైన్ తీసుకునేవాడు. అడ్డదారిలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదనకు డ్రగ్స్ విక్రయం వైపు మళ్లాడు. కొద్ది మొత్తంలో కొకైన్, హెరాయిన్ వంటివి కొనుగోలు చేసి పర్యాటకులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకునేవాడు. 2012లో పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నాడు. దీంతో స్టాన్లీ అక్రమంగా నివాసం ఉంటున్నట్టు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేసి 6 నెలలు జైల్లో ఉంచారు.
శంషాబాద్ విమానాశ్రయంలో మహిళా ప్రయాణికురాలి నుంచి భారీగా హెరాయిన్ పట్టివేత - విలువ తెలిస్తే షాక్!